Protein deficiency : మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఏవో తెలుసా?
ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థకు ప్రోటీన్ చాలా అవసరం. మన శరీరంలో కావల్సినంత ప్రోటీన్ ఉన్నప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఇక ప్రోటీన్ లోపిస్తే అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థకు ప్రోటీన్ చాలా అవసరం. మన శరీరంలో కావల్సినంత ప్రోటీన్ ఉన్నప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఇక ప్రోటీన్ లోపిస్తే అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. శారీరకంగా చాలా బలహీనంగా మారిపోతారు. అందువలన వైద్యులు ఆరోగ్యంగా ఉండటానికి మంచి ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. కానీ కొంత మంది అవి ఏమీ పట్టించుకోకుండా ప్రోటీన్ లోపానికి గురై అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. అయితే ప్రోటీన్ లోపిస్తే మన శరీరంలో నాలుగు లక్షణాలు కనిపిస్తాయంట. కాగా, అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మం, జుట్టు పాలిపోవడం : ప్రోటీన్ లోపం వలన జుట్టు, చర్మం, గోళ్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. గోళ్లు పెళుసు గా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే ప్రోటీన్ లోపం ఉన్నట్లే.
ఆకలి ఎక్కువ అవ్వడం : విపరీతంగా ఆకలి కావడం, అస్సలే ఆకలిని నియంత్రించి లేకపోవడం వంటి సమస్య ఏర్పడితే కూడా ప్రోటీన్ లోపం ఉన్నట్లే నంట. మీకు ఆకలి విపరీతంగా వేస్తే మీలో ప్రోటీన్ లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. తక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి.
బలహీనంగా మారడం : ప్రోటీన్ లోపం వలన చాలా బలహీనంగా మారిపోతారు. ఎంత తిన్నా తిననట్లు, చాలా నీరసంగా, అలసటగా కనిపిస్తారు. అటువంటి సమయంలో మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి.
కండరాల బలహీనత : ప్రోటీన్ సరిపడా శరీరంలో లేకపోవడం వలన కండరాల కణజాలం విచ్ఛిన్నం అయి, బలహీనత ఏర్పడుతుంది. ( నోట్ : పై వార్త నిపుణులు, ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)