ప్రతి రోజు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలేంటో తెలుసా?

మనలో చాలా మంది చిన్న పని చేయగానే అలిసిపోతుంటారు.

Update: 2023-07-24 09:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది చిన్న పని చేయగానే అలిసిపోతుంటారు. అలాంటి సమయంలో మనం లేచే పరిస్థితిలో కూడా ఉండము? పడుకోలేము , కూర్చోలేము, ఏ పని కూడా సరిగా చేయలేము? ఇక్కడ మీ సమాధాం అవును అయితే మీరు బలహీనంగా ఉన్నారని అర్ధం. మీ అలసట, బలహీనతకు చెక్‌ పెట్టడానికి ఉత్తమమైన మార్గం ఆహారం. మీ ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మీ శరీరంలో శక్తిని తిరిగి నింపవచ్చు. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాల్సిందే.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. రోజూ పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

2. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

3. క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి.

4. కరివేపాకు తింటే రక్త హీనతను తగ్గిస్తుంది.

5. ఖార్జురం తింటే మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం అయ్యేలా చేస్తుంది.

6. కీర దోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ శిరోజాలకు మేలు చేస్తాయి.

7. బీట్ రూట్ తింటే బీపీ అదుపులో ఉంటుంది.

8. జామ పండ్లతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

9. అల్లం తింటే ఉబ్బరం, మల బద్దకాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లితో శ్వాస సమస్యలు తగ్గుతాయి.

Tags:    

Similar News