చలికాలంలో తరచుగా ఫిష్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
చలికాలంలో పలు రకాల జబ్బులు వస్తాయని కొంతమంది ఏ ఏ ఆహారాలు తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు.
దిశ, వెబ్‌డెస్క్: చలికాలంలో పలు రకాల జబ్బులు వస్తాయని కొంతమంది ఏ ఏ ఆహారాలు తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. ఎందుకంటే వారికి ఏ జబ్బైనా తొందరగా స్ర్పెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే శీతాకాలంలో చేపలు తినవచ్చా? లేదా? అనే సందేహాలు చాలా మందిలో తలెత్తే ఉంటాయి. దీంతో ఆరోగ్య నిపుణులు.. శీతాకాలంలో చేపలు తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని తాజాగా క్లారిటీ ఇచ్చారు. చలికాలంలో తరచూగా ఫిష్ తింటే.. జలుబు, దగ్గు, లంగ్స్‌కు సంబంధించిన వ్యాధులున్న వారు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న వారు, చేపలు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
అలాగే శరీరంలోని అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లోపాల్ని తగ్గిస్తుందని, కంటిచూపుని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. విటమిన్ బి12 ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధులను తరిమికొడుతుంది. ఇలాంటి పోషకాలు సల్మాన్ ఫిష్‌లో ఉంటాయి. ఫిష్ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, గుండె సమస్యలను తగ్గించడం, జ్ఞాపకశక్తిని మెరుగు పరచడం, శరీరంలో వచ్చే వాపులు తగ్గించడంలో మెండుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.