చేతికి ఉంగరం పెట్టుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

చేతికి ఉంగరాలు పెట్టుకోవడం అనేది చాలా కామన్. ప్రతీ ఒక్కరూ చేతి ఉంగరం పెట్టుకుంటారు. అయితే కొందరు అలంకరణకు ఉంగరం ధరిస్తే మరి కొందరు అదృష్టం కోసం ధరిస్తారు. కాగా, ఉంగరం అదృష్టం

Update: 2023-04-27 02:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చేతికి ఉంగరాలు పెట్టుకోవడం అనేది చాలా కామన్. ప్రతీ ఒక్కరూ చేతి ఉంగరం పెట్టుకుంటారు. అయితే కొందరు అలంకరణకు ఉంగరం ధరిస్తే మరి కొందరు అదృష్టం కోసం ధరిస్తారు. కాగా, ఉంగరం అదృష్టం, అలంకరణకే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉంగరం ధరించడం వలన అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చంట.

కాగా, ఉంగరాన్ని వేలికి ధరించడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

1. చేతి వేళ్లకి రాగి ఉంగరాన్ని ధరించడం వలన జాయింట్ పేయిన్స్, ఉదర సమస్యలు ఉండవంట. అలాగే మన శరీరంలోని రక్తం చాలా ప్యూర్‌గా ఉండేలా చేస్తుందంట.

2. వెండి ఉగరం ధరించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందంట. అలాగే ఒత్తిడిని దూరం చేస్తుందంట.

3. ఏ రకమైన ఉంగరం పెట్టుకున్నా, అది మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందంట. అంతే కాకుండా కొన్ని ఉంగరాలు అదృష్టాన్ని తీసుకొస్తాయంట. అందువలన ఉంగరం ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News