బ్రహ్మముహుర్తంలోనే లేచి స్నానం ఆచరించే పక్షి ఏదో తెలుసా?
పూర్వం సూర్యోదయానికి ముందు, బ్రహ్మ ముహుర్తంలోనే నిద్ర లేచి, స్నానం ఆచరించి పూజలు చేసుకునే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉదయం తొమ్మిది, పది అయితేగాని లేచి పూజ చేసేవారే కరువయ్యారు
దిశ, వెబ్‌డెస్క్ : పూర్వం సూర్యోదయానికి ముందు, బ్రహ్మ ముహుర్తంలోనే నిద్ర లేచి, స్నానం ఆచరించి పూజలు చేసుకునే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉదయం తొమ్మిది, పది అయితేగాని లేచి పూజ చేసేవారే కరువయ్యారు. కానీ ఈ కాలంలో కూడా బ్రహ్మముహుర్తంలో లేచి స్నానం ఆచరించి, సూర్యస్తమయం అవుతే ఆహారం ముట్టని వారు కూడా ఉన్నారు. ఈ కాలంలో అలాంటి మనుషులు ఎక్కడున్నారు అనుకుంటున్నారా.. మనుషులు కాదండోయ్ పక్షి.
మనుషుల్లో మార్పులొచ్చాయి గానీ పక్షుల్లో మాత్రం మార్పు రాలేదు.కానీ మనిషి తాను మారిపోతు ప్రకృతిలో జీవరాశుల జీవనశైలిపై కూడా ప్రభావం చూపిస్తున్నాడు. కానీ మనిషికి కూడా గొప్ప సందేశం ఇచ్చే ఓ పక్షి గురించి చెప్పుకుని తీరాలి. అదే ‘కాకి’. కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది. కాకి అని తేలిగ్గా తీసిపారేయొద్దు. చాలా గొప్ప లక్షణాలు కలిగినది కాకి. అందుకే ‘కాకిని కాలజ్ఞాని’ అంటారు.
వేకువ జామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఎట్టిపరిస్థితుల్లోను ఆహారం ముట్టని జీవి కాకి మాత్రమే. అంతేకాదు సూర్యగ్రహణానికి ముందు..గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేసే ఏకైక పక్షి కాకి. గ్రహణం తరువాత తన గూడును శుభ్రం చేసుకునే పక్షి కాకి. “కావు కావు” అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ “కావు కావు” అని అందరికీ గుర్తు చేస్తుంది. అందుకే ‘కాకిని కాలజ్ఞాని’ అంటారు.
Read More: ఈ ఆకురసంతో షుగర్ కు చెక్ పెట్టొచ్చు!