స్నానం చేయట్లేదని విడాకులు.. బట్టల్లేకుండా బయటకెళ్తానంటూ భార్య?
ఆయన ప్రేమ ఆమెను విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తుందనే అభియోగం. Divorce cases are increasing high
దిశ, వెబ్‌డెస్క్ః ఆధునిక పరిజ్ఞానం పెరిగింది, నాగరికంగా సమాజం కూడా ఎదుగుతూనే ఉంది. అయితే, వీటితో పాటు సంబంధబాంధవ్యాలు మాత్రం మెరుగుకావట్లేదు. పైగా చిన్న చిన్న కారణాలకే బంధాలను తెంచుకోడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. తర్వాతి జనరేషన్ గురించి కూడా ఆలోచించకుండా దంపతులు విడిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే ఇక్కడ రెండు సంఘటనలు చూడొచ్చు. ఒక ఘటనకు సంబంధించి, సౌదీ అరేబియాలో ఓ భార్య తనకు విడాకులివ్వకుంటే నగ్నంగా ఇంటి బయటకు వెళతాననీ, బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతానంటూ భర్తతో గొడవకు దిగింది. ఏం చేయాలో తెలియని భర్త షారియా కోర్టును ఆశ్రయించాడు. కోర్టు కూడా ఆమె విడాకులు కోరుతుంది గనుక ఇవ్వక తప్పదంటూ చేతులెత్తేసింది. విడాకులు మంజూరు చేసింది. వాస్తవానికి గత దశాబ్ధకాలంలో ఇలా చిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం సౌదీఅరేబియాలో 60 శాతం ఎక్కువయినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక, ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఓ భర్త తన భార్య రోజూ స్నానం చేయట్లేదని త్రిపుల్ తలాక్‌తో బంధాన్ని బద్దలు చేశాడు. మైండ్ బ్లాక్ అయిన భార్య కోర్టుకు వెళ్లి, నాకు విడాకులిచ్చాడు కాపాడంటంటూ మొత్తుకుంది. కారణం తెలుసుకున్న అలీఘర్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ ప్రారంభించింది. ఇరువురి పెద్దలతో మాట్లాడి, పరిష్కారం దిశగా భర్తను ఒప్పిస్తోంది. ఏడాది వయసున్న బిడ్డను దృష్టిలో ఉంచుకొని కలిసి జీవించమని చెప్పింది. స్నానంచేయట్లేదనే కారణంతో ముగ్గురు జీవితాలు బలైపోవడంపై న్యాయం కాదంటూ బతిమాలింది.
మరో కేసు చూడండి! ఓ మహిళ పెళ్లైన 18 నెలలకే విడాకులు కావాలంటూ షారియా కోర్టును ఆశ్రయించింది. కారణం, తన భర్త తనతో అస్సలు గొడవే పడడు. ఆయన ప్రేమ ఆమెను విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తుందనే అభియోగం. కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేయలేదు గానీ తీవ్రమైన షాక్‌కు గురయ్యింది. ఇలాంటి, ఘటనలు కోకొల్లలు ఉండొచ్చు. ఒక్కో కథలో ఒక్కో కారణం. కారణం పంచుకోడానికి ఉండాలి గానీ, తెంచుకోడానికి ఉండకపోతే సంతోషకరమైన సంబంధం సాకారమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బైక్ వెరైటీగా కొన్నాడు... 10 గంటలు చుక్కలు చూసిన షోరూమ్ సిబ్బంది