Oral Hygiene: నోటిలో ఉండే ఈ బ్యాక్టీరియా చాలా డేంజరని మీకు తెలుసా?

మనలో చాలా మంది ఏదైనా తిన్న వెంటనే బ్రష్ చేస్తారు.

Update: 2024-08-21 12:44 GMT

దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది ఏదైనా తిన్న వెంటనే బ్రష్ చేస్తారు. మరి కొందరు నోటిని శుభ్రం చేసుకోకుండా అలాగే ఉండిపోతారు దీని వలన మౌత్ లో బ్యాక్టీరియా పెరిగిపోయి చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. రాత్రి పూట భోజనం చేసి పడుకున్న తర్వాత ఉదయాన్నే నోటిలో కొన్ని వేల రకాలు బాక్టీరియా ఉంటాయి. ఇది చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేవగానే మన నోరు ఎందుకు విషపూరితంగా మారుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

నోటిని ఎందుకు శుభ్రం చేసుకోవాలి?

నోటిలోని లాలాజలంలో యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ నుంచి దంతాలను కాపాడుతుంది. ఉదయం మంచి నీటిని తాగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. నోటిని మంచిగా క్లీన్ చేసుకోకపోతే.. అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దారి తీస్తుంది.

గుండె సమస్యలు

మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆహారాన్ని నమిలేటప్పుడు దంతాలను బలంగా ఉపయోగిస్తాము. మౌత్ లో ఉండే సూక్ష్మ జీవులు కార్డియాక్ వాల్వ్‌ను ప్రభావితం చేస్తుంది దీని వలన హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

చిగుళ్ల సమస్య

నోటిలో ఉండే చెడు బ్యాక్టీరియా వల్ల దంతాల ఇన్ఫెక్షన్స్, చిగుళ్ల సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అయితే చిగుళ్ల నుంచి అదే పనిగా రక్తం వస్తూ ఉంటుంది. కాబట్టి ఉదయం, రాత్రిపూట బ్రష్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News