Leaf green vegetables: ఆ ఆకు కూరలతో కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా

ఆకు కూరలు వారంలో మూడు సార్లు తినాలని వైద్యులు చెబుతుంటారు.

Update: 2024-08-13 11:02 GMT

దిశ, ఫీచర్స్ : ఆకు కూరలు వారంలో మూడు సార్లు తినాలని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా మంచివి. కొందరైతే రోజూ ఏదొక ఆకు కూరను ఇష్టంగా తింటారు. వీరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా ఇవి మనకు కావాల్సిన ప్రొటీన్లను అందివ్వడమే కాకుండా జీర్ణ క్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. వీటిని తీసుకోవడం వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

తోట కూర

మనలో చాలా మంది ఆకు కూరలు ఎక్కువగా తింటారు. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన విటమిన్లు ఎ, కె, బి6, సి, అలాగే రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఉంటాయి. రక్తహీనతతో సమస్యతో బాధపడేవారికి తోటకూర మించిన ఆహారం లేదు. ఇది అధిక రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తుంది.

మెంతికూర 

ఈ మెంతి కూరలో ఫోలిక్ యాసిడ్, జింక్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యంపై ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. దృఢంగా ఉండాలంటే మెంతికూర తినాలని నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకు

మనం నిత్యం కూరల్లో వాడే కరివేపాకు శరీరంలోని టాక్సిన్స్ ను పూర్తిగా తొలగిస్తుంది. కరివేపాకు వలన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. కిడ్నీ సమస్యలతో బాధ పడేవారు రోజూ కరివేపాకును తినడం మంచిది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News