Apple Cider Vinegar: అనేక ఔషధ గుణాల గని యాపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెప్తుంటారు.
దిశ, ఫీచర్స్ : ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెప్తుంటారు. ఇందులో నీరు, విటమిన్లు, ఖనిజాలు బాగా ఉంటాయి. ఒకప్పుడు ఇది ఎక్కువగా దొరికేది కాదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉంటోంది. దీనిని తాగడంవల్ల రక్తంలో అధిక చక్కెర స్థాయిలు తగ్గుతాయి. శరీరంలోని కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌తోపాటు కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరంలో రోగకారక బ్యాక్టీరియాలు నాశనం అవుతాయి. ఎక్కిళ్ల సమస్యను కూడా నివారిస్తుంది. సైనస్‌తో బాధపడేవారు, తరచూ ముక్కు కారడం సమస్య ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడంవల్ల ఉపశమనం కలుగుతుంది. ఇందులోని విటమిన్ బి, మెగ్నీషియం, మెగ్నీషియం ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్లను త్వరగా తగ్గిస్తాయి. పడుకునే ముందు పొత్తి కడుపులో అసౌకర్యంగానో, నొప్పిగానో ఉండేవారు సైడర్ వెనిగర్ జ్యూస్ తాగడంవల్ల వెంటనే ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అజీర్ణం, నిద్రలేమి, కాళ్లూ చేతులు తిమ్మిర్లు పట్టడం, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో సైడర్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇటువంటి సమస్యలు ఉన్నవారు రోజూ పడుకునే ముందు ఒక టీ స్పూన్ వెనిగర్‌ను తాగడంవల్ల మేలు జరుగుతుంది.