Cancer Risk : రోజూ ఉదయం చేసే ఈ పొరపాట్లతో ఆ రిస్క్ పెరుగుతుంది.. తల, మెడ భాగాల్లో కూడా..

Cancer Risk : రోజూ ఉదయం చేసే ఈ పొరపాట్లతో ఆ రిస్క్ పెరుగుతుంది.. తల, మెడ భాగాల్లో కూడా..

Update: 2024-10-04 08:24 GMT

దిశ, ఫీచర్స్: ఏమవుతుంది లే.. అని మనం ఈజీగా తీసుకునే విషయాలు కూడా కొన్నిసార్లు సీరియస్ రియాక్షన్‌ను కలిగించవచ్చు. ముఖ్యంగా ఉదయం పూట బ్రష్ చేయకపోవడమనే చిన్న పొరపాటు కూడా కొంతకాలానికి చిగుళ్ల సమస్యకు తద్వారా తల, మెడ క్యాన్సర్లకు దారితీసే అవకాశం ఉందని ‘ది జర్నల్ ఆఫ్ జామా అంకాలజీ’లో పబ్లిషైన అమెరికన్ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడిస్తోంది. ఓరల్ హైజీన్ లేకపోతే డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ కూడా పెరిగే చాన్సెస్ ఏర్పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు పలువురు మహిళలు, పురుషుల నోటిలోని లాలాజలం నుంచి వందలాది బ్యాక్టీరియాలను సేకరించారు. వాటి జెనెటిక్ స్ట్రక్చర్‌ను ఎనలైజ్ చేశారు. కాగా వీటిలో 13 రకాల బ్యాక్టీరియాలు తల, మెడ భాగాల్లో కణితులు, క్యాన్సర్లతో సంబంధం కలిగి ఉన్నాయని ఈ సందర్భంగా వారు కనుగొన్నారు. అట్లనే చిగుళ్ల వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాలలో 50 శాతం వరకు తల, మెడ క్యాన్సర్లకు కూడా కారణం అవుతాయని తెలిపారు. అందుకే ప్రతిరోజూ బ్రష్ చేయాలని, నోటిని దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Similar News