Exercises for Muscles:జిమ్‌కి వెళ్లకుండా మజిల్స్‌ని ఇలా పెంచుకోండి..!

ఫిట్‌గా ఉండడానికి చాలామంది జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేస్తుంటారు.

Update: 2024-11-10 11:25 GMT

దిశ, ఫీచర్స్: ఫిట్‌గా ఉండడానికి చాలామంది జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేస్తుంటారు. ముఖ్యంగా మగవారు కండలు పెంచుకోవడానికి, సిక్స్‌ ప్యాక్ కోసం ట్రై చేస్తారు. దీనికోసం డబ్బు ఖర్చు పెట్టి మరి వర్కౌట్స్ చేస్తుంటారు. అయితే, ఎటువంటి జిమ్ పరికరాలు లేకున్నా కొన్ని వర్కౌట్స్ చేస్తే, కండలు పెరుగుతాయి. కండలు పెంచడం వల్ల ఫిట్‌నెస్ మెరుగుపడడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంట్లోనే సింపుల్‌గా వర్కౌట్స్ చేయడం వల్ల కండరాలు పెరుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

స్క్వాట్స్: మార్నింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నప్పుడు 15 నుంచి 20 స్క్వాట్స్ చేయాలి. ప్రతీ రోజు ఇలా చేయడం వల్ల కండరాలు బాగా పెరిగుతాయి. స్క్వాట్స్ చేసేందుకు ముందుగా నడుమును వచి కుర్చీలో కూర్చున్నట్లుగా చేయాలి. కాళ్లపై భారం వేస్తూ.. నడుమును వంచి గాల్లో కూర్చోవాలి. ఇలా రోజుకు 20 స్క్వాట్స్ చేయాలి. ఎవ్వరైనా ఇది చేయవచ్చు. దీనిని చేయడం వల్ల కండరాలు దృఢంగా మారడే కాకుండా.. బాడీ షేప్ అందంగా మారుతుంది. నడుము కింద ఉన్న క్యాలరీలు బర్న్‌ చేయడంలో ఈ వ్యాయామం ఉత్తమంతా పనిచేస్తుంది.

లంజెస్: ముందుగా ఏదో ఒక కాలితో ముందుకు అడుగు వేయాలి. ఆ తర్వాత చాపిని కాలును వంచి 90 డిగ్రీల కోణంలో నేలకు తాకించాలి. ఇలా రెండు కాళ్లతో రిపీట్ చేస్తుండాలి. ఇలా 15 లంజెస్ చేయాలి. ఇది చేసేందుకు సింపుల్‌గా ఉన్నా, శరీరంలోని కండరాలు బలంగా మారడమే కాకుండా..కండరాలు వ్యాకోచించేందుకు తోడ్పడుతుంది.

ప్లాంక్ ఎక్సర్‌సైజ్‌: ఎక్కువగా కష్టపడి చేసే వర్కౌట్స్‌లో ప్లాంక్ ఒకటి. ప్రతి రోజూ ఈ వ్యాయామం చేయడం వల్ల చాలా వరకు బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది. ఈ ప్లాంక్ చేయడం వల్ల కోర్ బలంగా మారుతుంది. కీళ్లపై ఒత్తిడి తగ్గించి మంచి పోశ్చర్ ఉండేలా చేస్తుంది. దీనిని చేయడం వల్ల స్టెబిలిటీ, ఫెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. భుజాలు, చేతులు బలంగా మారుతాయి. ఇది చేయాలంటే కిందపడుకుని మోచేతులపై శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ పొజిషన్‌లోనే 30 నుంచి 60 సెకన్ల పాటు ఉండాలి.

పుష్‌ అప్స్‌: పుష్ అప్స్ వ్యాయామం చాలా ఆరోగ్యకరమైనది. ఈ వ్యాయామం శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా.. ఫ్యాట్‌ని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇది ఛాతి భాగానికి మంచిది. ముందుగా బోర్లా పడుకొని, అరచేతులపై భారం వేస్తూ మొత్తం శరీరాన్ని పైకి లేపాలి. ఆ తర్వాత నేలకు తాకేలా శరీరాన్ని కిందకు తీసుకు వస్తూ, పైకి లేపాలి. కొత్తగా చేసే వారు అయితే, నిదానంగా వీటిని చేయడం మంచింది. ప్రతీ రోజు 15 నుంచి 20 పుష్ అప్స్ చేయడం వల్ల శరీరమంతా కండరాలు పెరిగేందుకు తోడ్పడుతుంది.

బర్పీస్: చేతులను కాళ్లని దగ్గరకు తీసుకురావాలి. తర్వాత రెండు కాళ్ళని వెనక్కి జంప్ చేసి పెట్టాలి. ఇప్పుడు పుష్ అప్ పొజీషన్‌లో రెండబు కాళ్లని వెనక్కి పెట్టండి. తర్వాత జంప్ చేస్తూ మళ్ళీ చేతుల దగ్గరికి కాళ్ళను తీసుకురండి. ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి. ఇది చేయడం వల్ల పూర్తి శరీరంలోని కండరాలు పెరిగేందుకు సహాయపడుతుంది. 

Read More ...

Sleeping tips : జీన్స్ వేసుకొని నిద్రపోతున్నారా..? అయితే ఇవి గుర్తుంచుకోండి!






Tags:    

Similar News