గేదె మూత్రం తాగండి.. గోమూత్రంతో అనారోగ్యం : స్టడీ
గోమూత్రం అనేక వ్యాధులను నయం చేయగలదని ఓ వర్గం చెప్తోంది.
దిశ, ఫీచర్స్: గోమూత్రం అనేక వ్యాధులను నయం చేయగలదని ఓ వర్గం చెప్తోంది. కానీ ఇందులో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా స్టమక్ ఇన్‌ఫెక్షన్స్‌కు కారణమవుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)లో జూన్ 2022 నుంచి నవంబర్ 2022 వరకు నిర్వహించబడిన అధ్యయనంలో.. ఆవు, గేదె మూత్ర నమూనాలపై పరిశోధనలు జరగ్గా వీటిలో ఎస్చెరిచియా కోలి బ్యాక్టీరియాతో సహా 14 రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉందని కనుగొన్నారు. ఇవి మానవులలో స్టమక్ ఇన్ఫెక్షన్స్‌కు కారణమవుతున్నాయని ఫలితాల్లో తేలింది.
అందుకే గోమూత్రం మానవ శరీరానికి మేలు చేస్తుందని భావించి సేవించకూడని, శుద్ధి చేసిన ఆవు యూరిన్‌లో బ్యాక్టీరియా లేకుండా పోతుందా అనేది తర్వాతి అధ్యయనం ద్వారా తెలుసుకుంటామన్నారు. దీంతో పోలిస్తే గేదే మూత్రం గొప్పదని, అధిక బ్యాక్టీరియల్ రియాక్షన్‌ను కలిగి ఉందని అధ్యయనం నిర్ధారించింది. ఎస్ ఎపిడెర్మిడిస్, ఇ రాపోంటిసి వంటి బ్యాక్టీరియాపై బఫలో యూరిన్ మరింత ప్రభావవంతంగా పని చేస్తుందన్నారు. ఇక ఆవు మూత్రం దేశవ్యాప్తంగా విస్తృతంగా విక్రయించబడుతోంది. అనేక వ్యాధులను నయం చేస్తుందని హామీ ఇవ్వబడుతోంది. కానీ దీనికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ట్రేడ్‌మార్క్‌ను లేదని గుర్తుంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read..