జ్ఞాపకశక్తి మెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తున్న 'బ్రహ్మి మూలిక'

జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది.

Update: 2023-01-25 06:51 GMT

దిశ, ఫీచర్స్ : బ్రహ్మి అనే ఆయుర్వేద మూలిక మానసిక రుగ్మతలను నివారిస్తుందని, శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ఇది మెదడు చురుకుగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల ఎదురయ్యే అలసటను, ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశాన్ని నివారిస్తుంది. బ్రహ్మి మూలికను వీలైనంత మేరకు ఔషధంగా స్వీకరించాలని సాంప్రదాయ వైద్య నిపుణులు సజెష్ చేస్తున్నారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉండటంతో సెల్యులార్ డ్యామేజ్‌ను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తరచూ బ్రహ్మి మూలికను వాడుతున్న వారిలో లెర్నింగ్ పవర్, జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణుల అధ్యయనంలో తేలింది. ఇది మెదడు కణాల క్షీణతను అరికడుతుంది. అలాగే శరీరంలోని వాత, పైత్యముల సమతుల్యతకు దోహదపడుతుంది.

నాడీ కణాలపై ప్రభావం

బ్రహ్మి మూలిక నాడీ కణాల్లో భాగమైన డెండ్రైట్‌లపై ప్రభావాన్ని చూపుతుంది. వీటి పొడవు, నాణ్యతలను మెరుగుదల వస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కలిగి ఉన్నందున వయస్సు మీదపడినవారిలో సంభవించే వివిధ మానసిక రుగ్మతలను పారదోలుతుంది. గాయాలైనప్పుడు కలిగే నొప్పిని, గ్యాస్ట్రిస్ వల్ల ఏర్పడే కడుపు, ఛాతీ మంటలను తగ్గిస్తుంది. క్యాన్సర్, డయాబెటిస్ , గుండె, మూత్రపిండాల వ్యాధుల ప్రభావాన్ని అరికడుతుంది.

ఎడిహెచ్‌డి నివారణకు

పిలల్లో అటెన్షన్-డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వంటి మానసిక సమస్యలను బ్రహ్మి మూలిక దూరం చేస్తుంది. మనుషుల్లోను, జంతువుల్లోను రోగ నిరోధకశక్తిని పెంపొందించేందుకు అద్భుతంగా తోడ్పడుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అలాగే పిల్లల్లో, పెద్దల్లో ఏకాగ్రత లేకపోవడం, మానసిక ఆందోళన, చిరాకు లక్షణాలను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. స్త్రీలలో జననేంద్రియ సమస్యల నివారణకు కూడా ఉపయోగపడుతుంది. అయితే ఆయా సమస్యలకు బ్రహ్మి మూలికను సొంతంగా వాడటం తగదని, ఆయుర్వేదిక్ వైద్యులను సంప్రదించి రోగ లక్షణాలను బట్టి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read...

డయాబెటీస్‌ రోగులు వేరుశెనగలు తింటే ఏమౌతుంది ? 

Tags:    

Similar News