Ghibli: భజన.. ప్రతీదానికి భజన.. చాట్‌జీపీటీలో గిబ్లీ ఫొటోల కోసం ట్రై చేసేవారికి బిగ్ షాక్!
Ghibli: చాలా మంది గిబ్లిని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: Ghibli: చాలా మంది గిబ్లిని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఆనందించారు. తమ వ్యక్తిగత ఫోటోలను కూడా పెట్టారు. కానీ ఇది ఇప్పుడు మీకు ఒక పెద్ద షాక్ ఇవ్వబోతోంది. ఎందుకంటే దానికి ఒక పెద్ద కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే..
ఇప్పుడు కథలోకి వెళ్లిపోదాం.
ఈ మధ్యకాలంలో చాట్ జీపీటీలో గిబ్లీ స్టైల్ ఫొటోలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాట్ జీపీటీ అనేది ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల చేత విపరీతమైన ఆదరణ పొందిన ఏఐ సాఫ్ట్ వేర్. దీనికి ఓపెన్ఏఐ రూపకల్పన చేసింది. ఇటీవల గిబ్లీ స్టైల్ చిత్రాలను క్రియేట్ చేయడానికి ఇది మరింత ప్రాచుర్యం పొందింది. ఫొటోలను యానిమేషన్ స్టైల్లో మార్చుకోవాలని ఆశించేవారందరికీ ఇది ఒక అద్భుత మార్గం. దీంతో జీబ్లీ స్టూడియోకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన అదరణ లభిస్తోంది. దీంతో ఫేస్బుక్ ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ ఇలా దేంట్లో చూసినా జిబ్లీ ఫొటోలు కనిపిస్తున్నాయి. అయితే జిబ్లీ ఇమేజ్ జనరేట్స్ ను విస్త్రుతంగా వాడేవారికి షాకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో ఈ గిబ్లీ భజన మామూలుగా లేదు. ప్రతిఒక్కరూ గిబ్లీ ఫొటోలకోసం ట్రై చేసేవారే. కానీ దీని వెనకున్న అనర్థాల గురించి ఆలోచిస్తూ మైండ్ బ్లాంకే.
అవును మీ ప్రమేయం లేకుండానే మీ ఫేషియల్ డేటాని ఓపెన్ వాడుకుంటుందని టెక్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అవును మీ వ్యక్తిగత ఫొటోలను పెట్టడం వల్ల మీకు సమస్యలను తెచ్చిపెట్టనుంది. మీకు సంబంధించిన సమాచారాన్ని అంతా ఓపెన్ ఏఐ షేర్ చేస్తుందని చెబుతున్నారు. దయచేసి దీని వాడకాన్ని తగ్గించుకోవాలని నెటిజన్లను కోరతుున్నారు. జిబ్లీ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో యూజర్ల కాస్త కూల్ గా ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. వాటిని మిస్ యూజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.