బోలెడన్నీ ప్రయోజనాలు చేకూర్చుతున్న కిస్మిస్ వాటర్..!
నిజానికి ఎండుద్రాక్షలో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
దిశ, ఫీచర్స్: నిజానికి ఎండుద్రాక్షలో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఎండుద్రాక్ష తింటే రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్) కంట్రోల్‌లో ఉంటాయి. ఆకలి వేసినప్పుడు స్నాక్స్ గా వీటిని తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండుద్రాక్షలోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, డయేరియాను నివారిస్తుంది. కిస్మిస్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల గుండెకు హాని కలగకుండా రక్షిస్తాయి. కాల్షియం, పొటాషియం అధికంగా ఉండే కిస్మిస్ పాలలో కలిపి తింటే బోన్స్ స్ట్రాంగ్ గా తయారవుతాయి. కిస్మిస్ లో ఉండే సహజమైన చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు చర్మ కణాల నష్టం నుంచి కాపాడతాయి. స్కిన్ ముడతలు రాకుండా ఉండటమే కాకుండా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలున్న ఎండుద్రాక్ష నీరు ప్రతి రోజూ తీసుకున్నట్లైతే శరీరంలోని వ్యర్థాలను తొలగించడంతో ఎంతో మేలు చేస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫెనాల్స్, ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. కాగా ప్రతి రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం దృఢంగా తయారవుతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు.