Green Chilli: పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?
సాధారణంగా భారతీయుల ఇళ్లలో పచ్చి మిర్చి వంటలో ప్రధాన భాగం అయిపోయింది. కూరలు, పచ్చళ్ళు, ఊరగాయలు.. ఇలా ఆల్మోస్ట్ ప్రతీ వంటకంలో యాడ్ చేయబడుతుంది. ఘాటు ప్రియులకు మరింత రుచిని పంచుతుంది. అయితే పచ్చి మిరపకాయలు కేవలం రుచి, ఘాటు
దిశ, ఫీచర్స్ : సాధారణంగా భారతీయుల ఇళ్లలో పచ్చి మిర్చి వంటలో ప్రధాన భాగం అయిపోయింది. కూరలు, పచ్చళ్ళు, ఊరగాయలు.. ఇలా ఆల్మోస్ట్ ప్రతీ వంటకంలో యాడ్ చేయబడుతుంది. ఘాటు ప్రియులకు మరింత రుచిని పంచుతుంది. అయితే పచ్చి మిరపకాయలు కేవలం రుచి, ఘాటు కోసం మాత్రమే కాదు ఐరన్, పొటాషియం, విటమిన్లు సి, ఎతో సహా అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్నాయి. ఇవన్నీ సరైన శారీరక పనితీరుకు కీలకమైనవి. అనేక ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు.
బరువు తగ్గించడంలో సహాయం
పచ్చి మిరపకాయలలో ఉండే ముఖ్య పదార్ధం క్యాప్సైసిన్...జీవక్రియను వేగవంతం చేస్తుంది. క్యాప్సైసిన్ వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా జీవక్రియను పెంచుతుంది. వేగవంతమైన జీవక్రియ వలన నిల్వ చేయబడిన కొవ్వు విచ్ఛిన్నం అయిపోయి బరువు తగ్గడం జరుగుతుంది. మిరపకాయలలో విటమిన్ B5 ఉండటం వల్ల కొవ్వు ఆమ్లాల విచ్ఛిన్నం సులభం అవుతుంది. ఇక పచ్చి మిరపకాయల్లో కేలరీలు కూడా ఉండవు.
మెరుగైన కంటి చూపు
విటమిన్ ఎ లోపం రాత్రి కండ్లు కనిపించక పోవడానికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది . మరింత తీవ్రమైన పరిస్థితుల్లో ఇది కోలుకోలేని అంధత్వానికి కారణం కావచ్చు. పచ్చి మిరపకాయలు విటమిన్ ఎను పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇవి కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి.
కాంతివంతమైన చర్మం
పచ్చి మిరపకాయల్లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ విటమిన్ సి చర్మాన్ని బిగుతుగా, ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఫైటోన్యూట్రియెంట్స్ ముడతలు, మచ్చలు, మొటిమలు, దద్దుర్లకు సమర్థవంతంగా చికిత్స చేస్తాయి. ఇక విటమిన్ ఇ చర్మానికి మేలు చేసే సహజమైన నూనెలను సృష్టిస్తుంది.
మూడ్ బూస్టర్
భోజనంతోపాటు పచ్చి మిర్చి తీసుకోవడం సంతోషాన్ని ఇస్తుందని... ఆందోళనను తగ్గిస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. వీటిలో ఉండే క్యాప్సైసిన్ యాంటీ డిపెసెంట్ గా వర్క్ చేస్తుంది. ఆనందకరమైన మానసిక స్థితి కొనసాగించేందుకు కారణం అవుతుంది.
అనారోగ్య నివారిణి
పచ్చి మిరపకాయలోని ఫైటోన్యూట్రియెంట్లు ఆస్తమా, దగ్గు, జలుబు వంటి ఊపిరితిత్తుల వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి, అలాగే శ్వాసకోశాన్ని శాంతపరుస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు.. అథ్లెట్స్ ఫుట్, జోస్టర్, కోలన్ ఇన్ఫెక్షన్లతో సహా పలు వ్యాధుల నుంచి రక్షిస్తుంది.