ప్రాణం తీసిన గుడ్డు.. చిన్నపిల్లలకు గుడ్డు పెడుతున్నారా? బీఅలర్ట్

గుడ్డు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2024-01-28 10:01 GMT

దిశ, ఫీచర్స్: గుడ్డు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి రోజూ ఉదయం పూట ఒక గుడ్డు తింటే శరీరానికి కావాల్సిన మాంసకృత్తులన్నీ అందుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతే కాకుండా జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు ఎదగడంలో గుడ్డు తోడ్పాటునందిస్తుంది. ఎముకలను స్ట్రాంగ్‌గా చేస్తుంది. ఎగ్ వైట్ కన్నా.. గుడ్డులో ఉండే పచ్చ సోన లో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.

ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఎగ్‌లోని ప్రోటీన్ రక్తపోటును తగ్గించడానికి, బోన్స్‌ ఆరోగ్యంగా ఉంచడానికి గుడ్డులోని విటమిన్ డి 6 ఇనుము ఎంతో ఉపయోగపడుతుంది. కాగా మనిషి ఆరోగ్యం కోసం ఎన్నో పోషకాలుండే గుడ్డు రోజుకొకటి తిన్న సరిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉంటారు. అలాగే గుడ్డు తినేవారు ప్రతి రోజూ వ్యాయామం కూడా చేయాలంటారు. అయితే తాజాగా గుడ్డు.. ఓ చిన్నారి ప్రాణం తీసిన ఘటన సిద్ధిపేట లోని దౌర్తాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటాడని భావించి సంగీత అనే మహిళ తన బిడ్డకు ప్రతి రోజు గుడ్డు పెడుతుంది. ఒక రోజు సంగీత తన కుమారుడికి ఉడకబెట్టిన గుడ్డును పొట్టు తీసి.. చేతికి ఇచ్చింది. తర్వాత ఆ పిల్లాడిని అక్కడే వదిలేసి ఆమె పని చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్లింది. సంగీత వెళ్లగానే ఆ పిల్లాడు గుడ్డు నోట్లో పెట్టుకున్నాడు. ఆ గుడ్డు కాస్త గొంతులో ఇరుక్కుపోయింది. అతడిని ఎవరూ గమనించకపోవడంతో పిల్లాడు కొంతసేపటి వరకు అలాగే పడి ఉన్నాడు. తర్వాత తల్లిదండ్రులు చూసి.. వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. పిల్లాడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు.

కాగా తల్లిదండ్రలు ఫుడ్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. బలమైన ఆహార పదార్థాలు పెట్టడమే కాకుండా పిల్లలు వాటిని ఎలాగైతే తినగలుగుతారో చూడాలి. గుడ్డు, ఫ్రూట్స్ లాంటివి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలి. దగ్గరుండి వారికి తినిపించాలి. లేకపోతే ఇలాంటి పరిణామాలకు దారి తీయాల్సి వస్తుంది.


Similar News