బీఅలర్ట్: గొర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

సాధారణంగా ప్రతి ఒక్కరి గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి.

Update: 2024-08-05 05:43 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా ప్రతి ఒక్కరి గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. అయితే కొంతమంది గోర్లకు కోసర్లలో తెల్లటి చంద్రవంక గుర్తు లాగా ఉంటడం మనం గమనించే ఉంటాం. అయితే వాటిని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ, అలా మచ్చలు ఉన్నాయి అంటే ఈ సమస్యలు ఉన్నట్టే అని అంటున్నారు నిపుణులు. మరి వాటి వల్ల వచ్చే సమస్యలు, నివారణ మార్గాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

* గోళ్ల మీద ఉండే తెల్లమచ్చలను ‘ల్యూకోనిచియా’ అని పిలుస్తారు. ఇవి శరీరంలో కొన్ని ప్రోటీన్ల కొరత కారణంగా ఇలా ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

*శరీరంలో సోడియం, కాపర్, జింక్, ఐరన్, కాలుష్యం లోపాలు ఉంటే గోరు ఆరోగ్యంపై ప్రభావం పడి.. ఇలాంటి మచ్చలు వస్తుంటాయి. అయితే వైట్ మిడిమిడి బనికోమైకోసిస్ అనే ఫంగస్ గోర్లపై వైట్ షేడ్స్‌ను కల్పిస్తాయి.

గోర్లపై ఈ మచ్చలు పోవడానికి చేయవలసినవి:

*గోర్లపై వెల్లుల్లి రెబ్బలను రోజూ రుద్దితే గోళ్లు బలంగా ఉండటంతో పాటు తెల్ల మచ్చలు రాకుండా ఉంటాయి. చాలామందిలో విటమిన్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్లలో ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి విటమిన్స్ పుష్కలంగా లభించే ఫుడ్‌ను తీసుకోవాలి అని అంటున్నారు వైద్యులు.

*దీనికోసం డైలీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, ఎగ్ వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి . ఇవన్నీ తినడం వల్ల తెల్ల మచ్చలు అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి పైన చెప్పిన విధంగా ఇవన్నీ తినండి. మీ ఆరోగ్యాన్ని పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోండి అని అంటున్నారు నిపుణులు.

*కాగా గోర్ల పై తెల్ల మచ్చలు లేవు అంటే వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అర్థం.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Tags:    

Similar News