ఈ ఆహారాలతో జాగ్రత్త.. వృద్ధాప్యం రావచ్చు!

ప్రస్తుతం చాలామంది చిరుతిళ్లకు బాగా అలవాటు పడుతున్నారు.

Update: 2024-11-09 09:48 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం చాలామంది చిరుతిళ్లకు బాగా అలవాటు పడుతున్నారు. అలా ప్యాకెట్లలో లభించే చిరుతిళ్లతోపాటు కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటే త్వరగా వృద్ధాప్యం వస్తుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. దీని గురించి అధ్యనాలు చెబుతున్న విషయాలు ఏంటో చూద్దాం.

అల్ట్రా ప్రెసెస్డ్ ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే జీవసంబంధమైన వృద్ధాప్యం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఫుడ్స్ వల్ల పెద్దవారిలో 30 శాతం జీవ గడియారాన్ని పెంచడంతోపాటు శరీరంలో ముడతలు, చర్మం కుంగిపోవడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ చిరుతిళ్లు, పానియాలు రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. అంతేకాకుండా ప్రతిరోజూ వీటిని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, నిద్ర సమస్యలు వస్తాయి.

మనిషి పుట్టినప్పటి నుంచి లెక్కించే వయసును ‘క్రోనోలాజికల్ ఏజ్’ అని అంటారు. శరీరంలోని కణాలు, కణజాలంతో లెక్కించే వయసును ‘బయాలాజికల్ ఏజ్‌’గా పిలుస్తారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ అధికంగా తినే వారిలో బయాలాజికల్ ఏజ్ పెరుగుతోందని, వారి క్రోనోలాజికల్ వయసుకు మించిన వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముందుగా తయారు చేసిన భోజనం, సాసేజ్‌లు, నగ్గెట్స్, బన్స్, ప్లాస్టిక్ ప్యాకెట్‌లో నిల్వ చేసిన పదార్ధాల వంటివి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌.

ఇటలీలో మధ్య వయస్సువారిపై చేసిన పరిశోధనలో.. 14శాతం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేవారిలో వాళ్ల వాస్తవ వయస్సుకు మించి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయని తేలింది. అంతేకాకుండా.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా 22,500 మందిపై చేసిన అధ్యయనంలో కూడా అధిక చక్కెరలు గల పాలియాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బయాలాజికల్ ఏజ్ పెరుగుతున్నట్లు తేలింది. ఈ పానీయాలు రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమై వృద్ధాప్యానికి దారితీస్తుంది. అందుకే ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటూ నాచురల్ ఫుడ్స్‌కు దగ్గరవ్వాలంటూ ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని చిట్కాలను కూడా సూచిస్తున్నారు.

ఇవి పాటించండి:

* మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలను భాగం చేసుకోండి.

* త్వరగా వృద్ధాప్యానికి దారితీసే ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు అయిన చక్కర, ఉప్పును రోజువారి ఆహారంలో తక్కువగా తీసుకోవాలి.

* ప్రతీరోజు నీటిని ఎక్కవగా తాగడం వల్ల టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

* బెర్రీలు, గింజలు, ఆకుకూరలు వంటి ఆహారాలు తీసుకుంటే, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఇవి మీ కణాలను రక్షించడంలో సహాయపడతాయి. 

Tags:    

Similar News