Atlas Robot : సినీ ఫీల్డ్‌లోకీ రోబో ఎంట్రీ..! కెమెరామెన్ లేకున్నా షూటింగ్ ఆగదేమో ఇక..!

Atlas Robot : సినీ ఫీల్డ్‌లోకీ రోబో ఎంట్రీ..! కెమెరామెన్ లేకున్నా షూటింగ్ ఆగదేమో ఇక..!

Update: 2025-04-12 09:44 GMT
Atlas Robot : సినీ ఫీల్డ్‌లోకీ రోబో ఎంట్రీ..! కెమెరామెన్ లేకున్నా షూటింగ్ ఆగదేమో ఇక..!
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : వంట చేసే రోబో, ఇంటిని శుభ్ర పరిచే రోబో, పక్షిలా ఎగిరే రోబో.. ఇలా అనేక హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి వచ్చి సంచలనంగా మారాయి. ఇవి ఆయా పనుల్లో మానవ శ్రమను తగ్గిస్తున్నాయి. పలు విషయాల్లో కంఫర్టుగా నిలుస్తున్నాయి. తాజాగా సినీ ఫీల్డ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఓ హ్యూమనాయిడ్ రోబోట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భవిష్యత్‌లో ఇక డైరెక్టర్లు, కెమెరామెన్లు, కొరియో గ్రాఫర్లు లేకుండానే సినిమాలు తీసే పరిస్థితి వస్తుందేమోనని పలువురు చర్చించుకుంటున్నారు.

వైరల్ సమాచారం ప్రకారం.. బోస్టన్ డైనమిక్స్ అభివృద్ధి చేసిన అట్లాస్ హ్యూమనాయిడ్ రోబో ఒకటి చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించింది. అంతేకాదు షూటింగ్ సందర్భంగా అచ్చం కెమెరా మెన్‌లా షాట్లను తీసింది. 20 కిలలో బరువును సైతం ఎత్తింది. ‘Interesting Engineering’ పేరుగల ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా ఇది షేర్ చేయబడింది. కాగా WPP, NVIDIA పేర్లుగల బ్రిటీష్ క్రియేటివ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ మల్టీనేషనల్ కంపెనీల ప్రాజెక్టులో భాగంగా రూపొందించబడింది.

తొలి ప్రయోగంలో అట్లాస్‌ రోబోను సినిమా సెట్‌లలో కెమెరా‌మెన్‌గా ఎలా ఉపయోగించుకోవచ్చో నిపుణులు పరిశీలించారు. ఈ సందర్భంగా అది ట్రయల్ షూట్‌లలో యాక్టివ్‌గా వర్క్ చేసింది. అలటాగే ఫుడ్ అండ్ డ్రింక్ బ్రాండ్‌ల కోసం కూడా కమర్షియల్ కెమెరాను సైతం ఆపరేట్ చేసింది. ఎల్ఈడీ వాల్యూమ్ వెదర్‌లో ఎంతో చక్కగా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భవిష్యత్తులో కెమెరా ఆపరేటర్లకు సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి కూడా రావచ్చునని పలువురు పేర్కొంటున్నారు. అయితే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ముఖ్యంగా అగ్ని పర్వతాలు, గుహలు, ఎత్తైన కొండలు వంటి ప్రాంతాల్లో షూటింగ్ సందర్భంగా కెమెరా మెన్లు సైతం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సవాళ్లను అధిగమించడంలో అట్లాస్ వంటి హ్యూమనాయిడ్ రోబోలు ఉపయోగపడతాయని కూడా కొందరు భావిస్తున్నారు. 

Full View

Tags:    

Similar News