viral video : అయ్యో.. మరీ అంత ఈజీనా..! ఈ విషయం తెలియక వేలకు వేలు తగలేస్తున్నాంగా..!!

viral video : అయ్యో.. మరీ అంత ఈజీనా..! ఈ విషయం తెలియక వేలకు వేలు తగలేస్తున్నాంగా..!!

Update: 2025-04-23 11:40 GMT
viral video : అయ్యో.. మరీ అంత ఈజీనా..! ఈ విషయం తెలియక వేలకు వేలు తగలేస్తున్నాంగా..!!
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలని పలువురు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వేలకు వేలు ఖర్చు పెట్టి జిమ్‌(gyms)లకు వెళ్తుంటే.. మరికొందరు లక్షలు పోసి ట్రెడ్ మిల్, ఇతర వ్యాయామ పరికరాలు కొంటుంటారు. కానీ అలాంటి అవసరం లేకుండానే తెలివైన ఆలోచనలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలుసా? అటువంటి ఐడియాకు సంబంధించిన ఫన్నీ వీడియో (Funny video)ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ నవ్వులు తెప్పిస్తోంది.

వైరల్ వీడియో(viral వీడియో) ప్రకారం.. ఒక వ్యక్తి ట్రెడ్‌మిల్‌(treadmill)పై రన్నింగ్ చేసే స్థోమతో, అవకాశమో లేకుంటే ఏం చేయాలో చేసి చూపించాడు. అందుకోసం అతను ఇంటిలో డోర్ వద్ద ఒక రాడ్‌ను అమర్చాడు. తర్వాత దానికింద ముందు భాగాన పాలిష్ బండలమీద ఆయిల్‌ను పోశాడు. ఇక అక్కడ కాలు పెట్టగానే సర్రున జారుతుంది కాబట్టి, రాడ్‌ను పట్టుకొని, ఆ ఆయిల్ పోసిన భాగంలో పరుగెత్తడం మొదలు పెడతాడు.

డోర్ వద్ద బండల(tiles)మీద ఆయిల్ పోసిన కారణంగా కాళ్లు ఈజీగా స్లిప్ అవుతాయి. కాబట్టి అచ్చం ట్రెడ్‌మిల్ మీద పరుగెత్తిన అనుభూతి కలుగుతుందట! అంతేకాకుండా జారుడు లక్షణంవల్ల రన్నింగ్‌లో వేగం కూడా పెరుగుతుంది. కానీ రాడ్డును పట్టుకోవడం కారణంగా పరుగెత్తినట్టే ఉన్నప్పటికీ ముందుకు వెళ్లకుండా అక్కడే ఉంటారు. కింద కూడా పడరు. ఇది చూసిన నెటిజన్లు ఓర్నీ.. ట్రెడ్ మిల్ వాకింగ్ మరీ అంత ఈజీనా.. పైసా ఖర్చు లేకుండా చేసేశాడుగా అని ఆశ్చర్యపోతున్నారు. 

Tags:    

Similar News