పిల్లలకు ఫోన్ ఇవ్వాల్సిన సరైన వయస్సు ఇదే.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..

డెయిలీ లైఫ్‌లో సెల్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తుండగా.. ఈ డిజిటల్ యుగంలో వారిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఏ వయసులో పిల్లలకు ఫోన్ ఇవ్వొచ్చు? ఏ ఏజ్‌లో ఎంత స్క్రీన్ టైమ్ ఉండాలి?

Update: 2024-09-26 17:03 GMT

దిశ, ఫీచర్స్ : డెయిలీ లైఫ్‌లో సెల్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తుండగా.. ఈ డిజిటల్ యుగంలో వారిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఏ వయసులో పిల్లలకు ఫోన్ ఇవ్వొచ్చు? ఏ ఏజ్‌లో ఎంత స్క్రీన్ టైమ్ ఉండాలి? అనే విషయాల్లో కూడా అనుమానాలు ఉండగా.. ఇక్కడ కొన్ని సూచనలు అందిస్తున్నారు నిపుణులు. 

ఆరేళ్లు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన పిల్లలకు ఫోన్ ఇవ్వొచ్చని సూచిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. అది కూడా రోజులో రెండు గంటలు మాత్రమేనని చెప్తున్నారు. ఇక ఆరేళ్ల కన్నా తక్కువ ఉన్న వారికి గంట సమయం రెకమెండ్ చేస్తున్నారు. అయితే పద్దెనిమిది నెలల కన్నా తక్కువ ఉన్న చిన్నారులను అస్సలు అనుమతించకూడదని హెచ్చరిస్తున్నారు. లేదంటే బ్రెయిన్ డెవలప్మెంట్, కంటి చూపు, ఫోకస్ చేయడంలో లోపం ఏర్పడుతుందని చెప్తున్నారు. సోషల్ ఇంటరాక్షన్, క్రియేటివిటీ,మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఆఫ్ స్క్రీన్ యాక్టివిటీస్ మస్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. కుటుంబంతో స్పెండ్ చేయడం, బయట ఆడుకోవడం, కథలు చదవడం లాంటి అలవాట్లు నేర్పించాలని అంటున్నారు.

ఇంట్లో ఫోన్ ఫ్రీ టైమ్ తప్పకుండా పాటించాలని.. డిన్నర్ తర్వాత అస్సలు మొబైల్స్ ముట్టకుండా ఉండాలని, ముఖ్యంగా బెడ్ రూమ్‌లో ఫోన్ అనుమతి ఉండకూడదని చెప్తున్నారు. పిల్లలు మారాం చేస్తే స్క్రీన్ టైమ్ షెడ్యూల్ చేయాలని.. హోమ్ వర్క్ ఫినిష్ చేసిన తర్వాత లేదంటే అప్పగించిన టాస్క్‌లు పూర్తి చేస్తేనే ఇస్తామని కండిషన్స్ పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాలను పిల్లలకు దగ్గరుండి నేర్పించాలని.. అప్పుడే రాంగ్ కంటెంట్ చూడకుండా ఉండగలరని చెప్తున్నారు నిపుణులు.

Tags:    

Similar News