స్లీప్ వాకింగ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ యోగాసనం దివ్యౌషధం..

కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది.

Update: 2024-09-17 14:20 GMT

దిశ, ఫీచర్స్ : కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. అలాంటి వారు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు క్రమం తప్పకుండా చేయడం ద్వారా ఈ వ్యాధిని నుంచి ఉపశమనం పొందవచ్చింటున్నారు యోగా నిపుణులు. నిద్రలో నడవడం అనేది తీవ్రమైన సమస్య. దీనిని వైద్య భాషలో స్లీప్ వాకింగ్ లేదా సోమ్నాంబులిజం అంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్లీప్ వాకింగ్ సమస్య మెదడు రుగ్మత కారణంగా సంభవించే వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు లేచి నడవడం ప్రారంభిస్తారు. సాధారణంగా ఇది గాఢ నిద్రలో జరుగుతుందంటున్నారు నిపుణులు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం స్లీప్ వాకింగ్ నివారణ కోసం నిర్దిష్ట చికిత్స లేదని చెబుతున్నారు. ఈ వ్యాధికి ఔషధానికి బదులుగా యోగా సహజ నివారణగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. విశేషమేమిటంటే కొన్నిసార్లు ఇంగ్లీష్ ట్రీట్మెంట్ తీసుకున్నా 100% ఫలితాలు రాకపోవచ్చు. అందుకే యోగాలో ప్రత్యేక ఆసనం ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, యోగ నిద్రాసనం, కొన్ని ఇతర ఆసనాలను క్రమం తప్పకుండా ఒక నెలపాటు సాధన చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. యోగా నిపుణులు వ్యాధిని నయం చేసే యోగాసనాలను, వాటి ప్రక్రియను చాలా సులభమైన పద్ధతిలో వివరించారు.

స్లీప్ వాకింగ్ సమస్యకు కారణాలు..

స్లీప్ వాకింగ్ ఏ వయసులోనైనా ప్రారంభం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో ఇది యుక్తవయస్సు వచ్చే సమయానికి ముగుస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది వృద్ధాప్యం వరకు కూడా కొనసాగుతుంది. అదే సమయంలో కొంతమందిలో ఈ అలవాటు పెద్ద పెరిగిన తర్వాత మొదలవుతుంది. ఇది కొన్ని తీవ్రమైన కారణాలను కలిగి ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు వ్యక్తి ఏమి చేస్తున్నారో కూడా తెలియదు. మానసిక ఒత్తిడి, అలసట లేదా సక్రమంగా నిద్రపోవడం వల్ల ఈ సమస్య తరచుగా సంభవిస్తుంది. అందుకే యోగా ఈ సమస్యను పరిష్కరించడానికి సమర్థవంతమైన పద్ధతిగా నిరూపించారు నిపుణులు.

మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది..

యోగా ద్వారా మనసుకు, శరీరానికి శాంతిని అందిస్తుందంటున్నారు నిపుణులు. ఈ ఆసనం మెదడును శాంతపరచడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

నిద్రాసన యోగా చేసే విధానం..

యోగా చేయాలనుకున్నప్పుడు చాపను నేల పై వేసి వెల్లకిలా పడుకోండి. తర్వాత చేతులను తలపైకి తీసుకుని, శరీరాన్ని నిటారుగా ఉంచండి. నెమ్మదిగా కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీ శరీరాన్ని వదులుగా వదిలి, మీ మనస్సును పూర్తిగా ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంచండి. శరీరాన్ని స్థిరంగా ఉంచడం 10 - 15 నిమిషాలు ఈ స్థితిలో ఉండండి. ఈ ఆసనం రోజువారీ అభ్యాసం మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. మెదడును గాఢ నిద్రలో ఉంచుతుంది.

ఇతర యోగా ఆసనాలు..

యోగా శిక్షకుడు ఆజాద్ భట్ మాట్లాడుతూ భ్రమరీ, ప్రాణాయామం శ్వాసకోశ వ్యవస్థను శాంతపరచడంలో, మనస్సును స్థిరీకరించడంలో సహాయపడతాయని చెప్పారు. దీని అభ్యాసం మెదడుకు శాంతి, స్థిరత్వాన్ని తెస్తుంది. ఇది నిద్ర సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. మరోవైపు, బాలసనా శాంతి, మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. 5 - 10 నిముషాల పాటు బాలాసనం చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండి మనిషికి మంచి నిద్ర వస్తుంది.

శవాసనం : శరీరం, మనస్సు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి శవాసన సాధన ఉత్తమ మార్గం. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంత పరుస్తుంది. ఇది నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుందంటున్నారు యోగా నిపుణులు.

నాడి శోధన ప్రాణాయామం : నాడి శోధన ప్రాణాయామం మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది మానసిక సమతుల్యతను తీసుకురావడానికి, నాడీ వ్యవస్థను శాంతపరచడంలో కూడా సహాయపడుతుందంటున్నారు యోగా గురువులు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News