Tips to Prevent Neck Pain :మెడనొప్పి వేధిస్తోందా.. అయితే ఇలా ట్రై చేయండి !
మీరు గంటల తరబడి మెడను వంచి పనిచేయాల్సి వస్తోందా? తరచూ మెడనొప్పితో బాధపడుతున్నారా? దాంతో ఏ పనీ చేయలేకపోతున్నారా?
దిశ, ఫీచర్స్: మీరు గంటల తరబడి మెడను వంచి పనిచేయాల్సి వస్తోందా? తరచూ మెడనొప్పితో బాధపడుతున్నారా? దాంతో ఏ పనీ చేయలేకపోతున్నారా? అయితే అది మీ ఉద్యోగ జీవితంపై, వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రారంభంలోనే సమస్యను దూరం చేసుకోడం బెటర్ అంటున్నారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. మనం కూర్చునే విధానం సరిగ్గా లేకుంటే మెడనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. నొప్పిగా అనిపించినప్పుడు చిన్న సమస్యే కదా అని లైట్ తీసుకుంటే జఠిలమయ్యే చాన్స్ ఉంటుంది. కాబట్టి కారణాలు తెలుసుకొని నివారణ పద్ధతులు ఫాలో కావడం మంచిది.
కారణాలివే: మెడనొప్పికి గల ప్రధాన కారణాల్లో సరిగ్గా కూర్చోకపోవడం ఒకటి, కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లను చాలాసేపు చూస్తూ ఉపయోగించడం, ఈ సందర్భంలో కూర్చునే తీరు సరిగ్గా లేకపోవడం మెడ కండరాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా నొప్పి రావచ్చు. మంచం మీద పడుకుని గానీ, కూర్చొని గానీ చదివేటప్పుడు ఒత్తిడి పెరగడంవల్ల కూడా మెడ నొప్పి వస్తుంది.
శరీరంలోని ఇతర కీళ్ల మాదిరిగానే, మెడ భాగంలోని కీళ్లు కూడా ఏజ్‌బార్ అయ్యేకొద్దీ అరిగిపోతుంటాయి. అది వయస్సు వల్ల ఏర్పడిన అరుగుదల అయితే ఎముక స్పర్స్‌కు దారితీస్తుంది. ఫలితంగా మెడ కదలికలు ప్రభావితం అయి నొప్పి కలుగుతుంది. అంతేగాక అకస్మాత్తుగా తల అటూ ఇటూ కదిలించినప్పుడు మెడ కండరాల్లో నొప్పి ఏర్పడవచ్చు. మెడలోని ఎముక స్పర్స్ లేదా హెర్నియేటెడ్ డిస్కులు వెన్నెముక నుంచి బయటవైపునకు ఉండే నరాలపై ఒత్తిడి కలిగిస్తాయి. ఇలాంటప్పుడు కూడా మెడనొప్పి వస్తుంది. ఇవేగాక మెనింజైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా క్యాన్సర్ వంటి వ్యాధులవల్ల కూడా మెడనొప్పి బాధిస్తుంది.
ఇలా చేస్తే నొప్పి తగ్గుంది
* కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు మీ భుజాలు తుంటి భాగంపై సమభాగ స్థయిలో ఉండేలా చూసుకోవాలి. అలాగే మీ చెవులు నేరుగా మీ భుజాలకు నిటారుగా సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. సెల్ ఫోన్లు, టాబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగిస్తున్నప్పుడు మెడ పొజిషన్ బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్త పడాలి. అలా ఉండాలంటే వాటిని వినియోగిస్తున్నప్పుడు అవి మీ తలకు అనుగుణంగా కాస్త ఎత్తులో పెట్టండి. అలాగే మీ వర్క్ టేబుల్, కంప్యూటర్, కుర్చీని మీకు కంఫర్ట్‌గా పెట్టుకోవాలి.
* ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయాల్సి వచ్చినా.. లేదా స్క్రీన్ ముందు గంటల తరబడి పనిచేయాల్సి వచ్చినా మధ్య మధ్యలో కొంచెం రిలాక్స్ అవ్వాలి. ముఖ్యంగా మీ మెడ, భుజాలను బాగా కదిలించాలి. శరీరాన్ని సాగదీయాలి. భుజాలు, చేతులపై ఎక్కువ బరువుండే బ్యాక్ ప్యాక్‌లను మోయవద్దు. ఎందుకంటే ఇలా చేయడం మీ భుజాలపైన ఒత్తిడిని పెంచుతుంది.
కలిగిస్తుంది. మెడ నొప్పిని కలిగిస్తుంది. ఇక కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు తల, మెడ శరీరంలోని మిగిలిన భాగాలకు అనుగుణంగా ఉండాలి. తలకింద పెద్ద సైజు దిండులను ఉపయోగించవద్దు. దిండు లేకుండా ఉండలేమనుకుంటే చిన్న దిండును మాత్రమే ఉపయోగించడం బెటర్. కాళ్ల కింద దిండును వేసుకుంటే కూడా మంచిది. దీనివల్ల మీ వెన్నెముక కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇలాంటి చిట్కాలతో మెడనొప్పి తగ్గనప్పుడు ఆర్థో పెడిక్ వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.