జలచరాలు.. జీవన మనుగడ.. ఏది ఎంతకాలం జీవిస్తుందంటే..

భూమి మనుషులకే కాదు, అనేక రకాల జీవరాశికి ఆవాసం కూడాను. దట్టమైన అడవులు, నదులు, సముద్రాలు, పర్వతాలు వంటి ప్రకృతి అందాలకు, జీవ వైవిధ్యానికి నిలయంగానూ ఉంటున్నది.

Update: 2024-06-06 12:20 GMT

దిశ, ఫీచర్స్ : భూమి మనుషులకే కాదు, అనేక రకాల జీవరాశికి ఆవాసం కూడాను. దట్టమైన అడవులు, నదులు, సముద్రాలు, పర్వతాలు వంటి ప్రకృతి అందాలకు, జీవ వైవిధ్యానికి నిలయంగానూ ఉంటున్నది. అయితే ఈ సువిశాల భూ ప్రపంచంలో ఎక్కువకలం జీవించి ఉండే పలు జంతువులు, కీటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నీటిలో అనేక జలచరాలు నివసిస్తుంటాయి. ముఖ్యంగా ఉప్పునీటి మొసళ్లు దాదాపు 70 ఏండ్లకు పైగా జీవిస్తాయట. మరికొన్ని మొసళ్లు 120 సంవత్సరాలకు పైగా మనుగడ సాగిస్తాయి. అలాగే తాబేళ్ల జీవితం కాలం సాధారణంగా 200 ఏండ్లు. కనీసం 190 ఏండ్లకు పైగానే జీవిస్తుంటాయి. ఇక ఎర్ర సముద్రపు అర్చిన్ల గురించి తెలిసిందే. ఇవి శరీరంపై ముళ్లతో కప్పబడిన చిన్నగా, గుండ్రంగా ఉండే అకశేరుకాలు. వీటి ఆయుష్షు వంద సంవత్సరాలు. వీటితోపాటు మౌహెడ్ తిమింగలాలు అత్యధిక కాలం జీవించే క్షీరదాలుగా ప్రసిద్ధి. ఇవి వంద నుంచి రెండు వందల సంవత్సరాలు జీవిస్తాయట.

చేపల జాతిలో రఫ్‌ఐ రాక్‌ఫిష్ ఒకటి. దీని గరిష్ట జీవిత కాలం సుమారు 205 సంవత్సరాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక నీటి నుంచి ఆహారాన్ని సేకరిస్తూ జీవించే మంచినీటి పెర్ల్ మస్సెల్స్ అయితే ఏకంగా 280 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రాల లోతులో నివసించే గ్రీన్లాండ్ సొరచేపలు మాగ్జిమ్ 272 ఏండ్లు మనుగడ సాగిస్తాయి. ఇక జెయింట్ బారెల్ స్పాంజ్‌లు అయితే రెండువేల సంవత్సరాలకు పైగా జీవిస్తాయట. 


Similar News