మాస్ కాపీంగ్‌లో మరో లెవల్ చీటింగ్.. పెన్నులే కదా అని వదిలేస్తే.. (వీడియో)
పరీక్షల్లో పాస్ కావాలంటే రెండే దారులు ఉంటాయి. ఒకటి బాగా చదవడం.. రెండోది ఇన్విజిలేటర్‌కు దొరకకుండా స్లిప్స్‌తో కాపీ కొట్టి పాస్ కావడం.
దిశ, డైనమిక్ బ్యూరో : పరీక్షల్లో పాస్ కావాలంటే రెండే దారులు ఉంటాయి. ఒకటి బాగా చదవడం.. రెండోది ఇన్విజిలేటర్‌కు దొరకకుండా స్లిప్స్‌తో కాపీ కొట్టి పాస్ కావడం. అంతకు మించిన దారులైతే ఉండవు. అయితే, ఈ తరుణంలో మోసం చేయడం కూడా ఓ కళ అని ఈ వీడియోను చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మోసం చేసే టాలెంట్ అందరికీ ఉండదు. అయితే, పరీక్షల్లో ఓ స్టూడెంట్ తన క్రియేటివిటీతో కొత్త టెక్నిక్‌ను ఉపయోగించాడు. పెన్నుల పౌచ్‌లో పెన్నులు, పెన్సిళ్లు ఉన్నట్టుగా అందర్నీ నమ్మించి, ఎగ్జామ్‌లో కాపీ కొట్టాడు. అయితే, ఈ వీడియోలో మాములుగా స్టూడెంట్ పౌచ్ చూస్తే అందులో కేవలం పెన్నులు, పెన్సిళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ చివరి దాకా చూస్తూనే తెలుస్తుంది.. అవి పెన్నులు కాదు.. మొబైల్ ఫోన్‌లోని గ్యాలరీలో ఉన్న ఒక ఫొటో అని. పౌచ్‌లో ఫోన్‌ను పెట్టుకుని గ్యాలరీలోని పెన్నుల ఫొటోను ఓపెన్ చేసి ఉంచాడు. ఎవరు చూడని సమయంలో ఈ ఫొటోని మినిమైజ్ చేసి, పక్కనే ఉన్న ఆన్సర్స్‌ను విద్యార్థి కాపీ కొట్టాడు. దీంతో, వీడియోని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది ఎక్స్ పర్ట్ లెవల్ చీటింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
This is expert level cheating pic.twitter.com/81es9GKzNF
— Lance🇱🇨 (@BornAKang) December 2, ౨౦౨౨READ MORE