మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ లిస్ట్‌లో మరో రోగం చేరింది...
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఆల్కహాల్ వినియోగంతో ఆరు రకాల క్యాన్సర్లు ముడిపడి ఉన్నాయి. తల, మెడ, అన్నవాహిక, రొమ్ము, కొలొరెక్టల్, కాలేయం, కడుపు క్యాన్సర్ రావచ్చని హెచ్చరిస్తుంది. యుఎస్‌లో 5.4 శాతం క్యాన్సర్‌లు ఆల్కహాల్ వినియోగం వల్లనే అని గుర్తించగా.. కొద్దిపాటి ఆల్కహాల్ హానికరం
దిశ, ఫీచర్స్ : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఆల్కహాల్ వినియోగంతో ఆరు రకాల క్యాన్సర్లు ముడిపడి ఉన్నాయి. తల, మెడ, అన్నవాహిక, రొమ్ము, కొలొరెక్టల్, కాలేయం, కడుపు క్యాన్సర్ రావచ్చని హెచ్చరిస్తుంది. యుఎస్‌లో 5.4 శాతం క్యాన్సర్‌లు ఆల్కహాల్ వినియోగం వల్లనే అని గుర్తించగా.. కొద్దిపాటి ఆల్కహాల్ హానికరం కాదనే భావనను తోసిపుచ్చింది.
ఆల్కహాల్ క్యాన్సర్‌కు ఎలా దారి తీస్తుంది?
మద్యపానంతో DNA దెబ్బతింటుంది. పోషకాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను మార్చగలదు. యుక్తవయస్సులో మద్యపానం చేయడం వలన వృద్ధాప్యంలో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు తాగడం వల్ల నవజాత శిశువులకు లుకేమియా వచ్చే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.
యుఎస్‌లో 5.4 శాతం క్యాన్సర్‌లు ఆల్కహాల్ తీసుకోవడం వల్లనే వస్తున్నాయని స్పష్టం చేసింది. ఇది 2011-19 కాలంలో 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో రెండు శాతం కొలొరెక్టల్ క్యాన్సర్ పెరుగుదలను కూడా హైలైట్ చేసింది. అయితే ఏ రకమైన పానీయం క్యాన్సర్‌కు దారితీస్తుందో నిర్ధారించబడలేదు, కానీ ఈ స్పిరిట్స్‌లోని ఇథనాల్ ప్రధాన ప్రమాద కారకంగా అభిప్రాయపడింది. దాదాపు 50 శాతం మంది అమెరికన్లకు ఆల్కహాలిక్ పానీయాలు, క్యాన్సర్ మధ్య ఉన్న ముఖ్యమైన లింక్ గురించి తెలియదని, ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది నివేదిక.