ఫోన్ కాల్ యాంగ్జయిటీ : ఫోన్ ఎత్తాలన్నా, చేయాలన్నా భయమేనా? డాక్టర్‌ను సంప్రదించడం మంచిది..

డిజిటల్ కమ్యూనికేషన్ యుగంలో ఫోన్ కాల్స్ మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. అయితే కొంతమంది వ్యక్తులకు ఒక ఫోన్ కాల్ చేయడం లేదా స్వీకరించడం.. తీవ్రమైన ఆందోళన, భయం కలిగిస్తుంది. రోజూవారీ కార్యకలాపాలను, వ్యక్తుల మధ్య సంబంధాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

Update: 2024-09-12 12:51 GMT

దిశ, ఫీచర్స్ : డిజిటల్ కమ్యూనికేషన్ యుగంలో ఫోన్ కాల్స్ మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. అయితే కొంతమంది వ్యక్తులకు ఒక ఫోన్ కాల్ చేయడం లేదా స్వీకరించడం.. తీవ్రమైన ఆందోళన, భయం కలిగిస్తుంది. రోజూవారీ కార్యకలాపాలను, వ్యక్తుల మధ్య సంబంధాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీనినే ఫోన్ కాల్ యాంగ్జయిటీగా పరిగణిస్తున్న నిపుణులు.. ఇతర మానసిక రుగ్మతల వలే దీన్ని ఇంకా పరిగణించనప్పటికీ చికిత్స అవసరం అంటున్నారు. దీన్నే టెలిఫోనోఫోబియా లేదా టెలిఫోబియా అని కూడా పిలుస్తుండగా.., ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఫోన్ మాట్లాడాలంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తమ సామర్థ్యానికి ఆటంకం కలిగించే ఆందోళన స్థాయిని అనుభవిస్తారు. ఇందుకు సంబంధించిన మరిన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.

ఎగవేత ప్రవర్తన : ఫోన్ చేయాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా.. అవాయిడ్ చేసేందుకు ముందుంటారు. వాయిస్ మెయిల్ కు కాల్స్ డైవర్ట్ చేయడం, ఏదో పని ఉందని చెప్పి తొందరగా ముగించడం చేస్తుంటారు.

శారీరక లక్షణాలు: ఫోన్ కాల్ ఆందోళన వేగవంతమైన హృదయ స్పందన, చెమట, వణుకు, శ్వాస ఆడకపోవడం, వికారం, మైకము, కండరాల ఉద్రిక్తత వంటి వివిధ శారీరక లక్షణాలతో వ్యక్తమవుతుంది. ఈ సింప్టమ్స్.. వ్యక్తికి బాధ కలిగించవచ్చు.

మితిమీరిన ఆందోళన: ఫోన్ కాల్ ఆందోళనతో ఉన్న వ్యక్తులు రాబోయే ఫోన్ కాల్‌ల గురించి అధిక శ్రద్ధ చూపుతారు, అవి సాధారణమైనా లేదా బెదిరింపులు లేనివి అయినా కూడా భయపడిపోతారు. జరగబోయే సంఘటనలు, జడ్జిమెంట్, విమర్శలకు భయపడవచ్చు. లేదా కాల్ సమయంలో తప్పుగా మాట్లాడటం గురించి ఆందోళన చెందవచ్చు.

కాల్స్ చేయడం కష్టం : ఈ బాధతో ఉన్న వ్యక్తులకు కాల్‌ చేయడం ప్రత్యేకించి సవాలుగా ఉంటుంది. అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించడం వంటి ముఖ్యమైన విషయాల కోసం కూడా కాల్ చేయడాన్ని వాయిదా వేయవచ్చు. అత్యంత అవసరమైన కాల్‌లు చేయడానికి వెనుకాడవచ్చు.

సోషల్ ఐసోలేషన్ : ఫోన్ కాల్ ఆందోళన సోషల్ ఐసోలేషన్‌కు దారితీస్తుంది. ఫోన్ కమ్యూనికేషన్‌తో కూడిన సామాజిక పరస్పర చర్యల నుంచి దూరం అయిపోతారు. ఫోన్ సమన్వయం అవసరమయ్యే ప్రణాళికలను రూపొందించడం లేదా కార్యకలాపాల్లో పాల్గొనడం మానుకోవచ్చు. ఒక్కోసారి వీటికి దూరమై ఒంటరితనం అనుభవించవచ్చు.

బలహీనమైన పనితీరు: ఫోన్ కాల్ ఆందోళన రోజువారీ పనితీరును గణనీయంగా దెబ్బతీస్తుంది, ముఖ్యంగా ఫోన్ కమ్యూనికేషన్ అవసరమైన ప్రొఫెషనల్ సెట్టింగ్‌లలో... ఉద్యోగ పనితీరుకు ఆటంకం కలిగించవచ్చు, నెట్‌వర్కింగ్ లేదా సహకారం కోసం అవకాశాలను పరిమితం చేయవచ్చు. కెరీర్ పురోగతికి అడ్డంకులను సృష్టించవచ్చు.

సంబంధాలపై ప్రతికూల ప్రభావం:

స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులతో ఫోన్ కమ్యూనికేషన్‌కు దూరంగా ఉండటం వల్ల వారు నిర్లక్ష్యం, నిరాశకు గురవుతున్నందున సంబంధాలను దెబ్బతీస్తుంది. ఫోన్ ద్వారా నార్మల్ టాపిక్ మాట్లాడటంలో ఇబ్బందుల కారణంగా అపార్థాలు, విభేదాలు తలెత్తవచ్చు.

ఎలా నివారించాలి?

  • క్రమంగా ఫోన్ కాల్స్ చేయడం, స్వీకరించడం అలవాటు చేసుకుంటే.. కాలక్రమేణా ఈ ఫియర్ పోతుంది.
  • కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT) పధ్ధతులు..కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్, ఎక్స్‌పోజర్ థెరపీ వంటివి ప్రయత్నించండి. ఫోన్ కాల్ ఆందోళనతో సంబంధం ఉన్న ప్రతికూల ఆలోచనలు, ప్రవర్తనలను సవాలు చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
  • రిలాక్సేషన్ టెక్నిక్స్: లోతైన శ్వాస, మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం వంటి పద్ధతులను అభ్యసించడం ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది.
Tags:    

Similar News