Crocodile : ఆరుగురు భార్యలు, పది వేల మంది పిల్లలు.. కొంచెం కొత్తగా ఈ మొసలి కథ..
700 కిలోల బరువు... 16 అడుగుల పొడవు.. ఆరుగురు భార్యలు.. పది వేలకు పైగా పిల్లలు... ఇవి ప్రపంచంలోనే అత్యంత పెద్ద మొసలి(Crocodile ) హెన్రీకి సంబంధించిన వివరాలు.
దిశ, ఫీచర్స్ : 700 కిలోల బరువు... 16 అడుగుల పొడవు.. ఆరుగురు భార్యలు.. పది వేలకు పైగా పిల్లలు... ఇవి ప్రపంచంలోనే అత్యంత పెద్ద మొసలి(Crocodile ) హెన్రీకి సంబంధించిన వివరాలు. 123 ఏళ్ల వయసు కలిగిన ఈ నరమాంస భక్షక మొసలి.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా(South Africa) స్కాట్‌బర్గ్‌లోని క్రోక్‌వరల్డ్ కన్జర్వేషన్ సెంటర్‌లో ఉంచబడింది. కానీ ఒకప్పుడు దీని పేరు వింటేనే ఒక తెగ వణికిపోయేది. ఇంతకీ ఈ కథేంటి చూద్దాం.
ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం 1900 సంవత్సరంలో పుట్టిన హెన్రీ బోట్స్వానాలోని స్థానిక తెగలకు నిద్ర లేకుండా చేసింది. ఛాన్స్ దొరికితే చాలు అక్కడి చిన్న పిల్లలను భక్షించే ఈ మొసలి పోరు పడలేని వారు.. పాపులర్ హంటర్ సర్ హెన్రీ న్యూమాన్ సహాయం కోరారు, అతని పేరు మీద మొసలికి ఈ పేరు పెట్టగా... ఈ మృగాన్ని చంపే బదులు బంధించాడు మిస్టర్ న్యూమాన్. జీవితకాలం బందిఖానాలో ఉంచే శిక్ష విధించాడు. అలా మొత్తానికి 30 ఏళ్లుగా కన్జర్వేషన్ సెంటర్‌లో ఉంటున్న ఈ హెన్రీ.. జీవించి ఉన్న అతిపెద్ద మొసలిగా గుర్తించబడింది.