భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా.. ఇలా చేయండి
భార్య భర్తల మధ్య గొడవలు అనేవి సహజం. ప్రతీ ఇంట్లో ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ, కొంత మంది ప్రతీ రోజు, ప్రతీ విషయంలో గొడవ పడుతుంటారు. అయితే అలా ఇంటిలో
దిశ, వెబ్‌డెస్క్ : భార్య భర్తల మధ్య గొడవలు అనేవి సహజం. ప్రతీ ఇంట్లో ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ, కొంత మంది ప్రతీ రోజు, ప్రతీ విషయంలో గొడవ పడుతుంటారు. అయితే అలా ఇంటిలో భార్యభర్తలు గొడవ పెట్టుకోవడం అస్సలే మంచిది కాదంట. మఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు గొడవ పెట్టుకోవడం, అది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందంట. అయితే అలా ఎప్పుడూ ఇంట్లో గొడవలు పెట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లో తెల్ల చందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చి పెట్టుకోవడం చాలా మంచిదంట. ఇది గొడవలను తగ్గించి, ఆలుమగల మధ్య ప్రేమను పెంచుతుందంట. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను తొలగిస్తుంది. అయితే కొద్దిగా ఉప్పు తీసుకొని గదిలో ఏదొక మూల కళ్లు ఉప్పును ఉంచి ఒక నెల అలా వదిలేస్తే చాలా మంచిది. ఇలా తరచూ చేస్తుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయంట.
Also Read..
పీరియడ్ రాకుండా మాత్రలు వాడుతున్నారా? బ్లీడింగ్ అధికం కావచ్చు..