7 Banned Indian Foods: ఇతర దేశాల్లో నిషేధించబడిన 7 ఇండియన్ ఫుడ్స్..!
కొన్ని ఆహారాలకు ఎప్పటికీ స్పెషల్ గుర్తింపు ఉంటుంది.
దిశ, ఫీచర్స్: కొన్ని ఆహారాలకు ఎప్పటికీ స్పెషల్ గుర్తింపు ఉంటుంది. అవి తీసుకుంటే అనారోగ్య పాలవుతారని తెలిసిన మిలియన్ల మంది ప్రజలు ఆ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే భారతదేశంలో ఎంతోమంది ప్రజలు లొట్టలేసుకుంటూ తినే 7 ఆహారాలను ఇతర దేశాల్లో నిషేధించబడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
నెయ్యి..
ఇండియాలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉపయోగించే నెయ్యిని యూఎస్‌లో నిషేధించారు. ఎందుకంటే నెయ్యి తింటే ఊబకాయం, గుండెపోటుకు కారణమవుతుందనే ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.
గసగసాలు..
భారతీయ వంటకాల్లో గసగసాలు ప్రధానమైనవి. వీటిలో ఎక్స్పెక్టోరెంట్, సిమల్సేంట్ (నయం చేసే గుణాలు) గుణాలు కలిగి ఉంటాయి. గసగసాలు శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అలాగే దగ్గు, ఆస్తమాను తగ్గిస్తాయి. గుండె సమస్యతో బాధపడుతున్న వారికైతే ఈ గసగసాలు మంచి ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. అయితే వీటిని సింగపూర్ అండ్ తైవాన్‌లలో నిషేధించారు.
చ్యవనప్రాష్..
ప్రముఖ భారతీయ ఆయుర్వేద సప్లిమెంట్ చ్యవన్‌ప్రాష్‌ను కెనడాలో 2005 నుంచే వాడకంలో ఉండేద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే చ్యవనప్రాష్‌లో సీసం, పాదరసం అధిక స్థాయిలో ఉంటుంది.
సమోస..
మన ఇండియన్స్ సమోసను ఎంత ఇష్టంగా తింటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. రోడ్ సైడ్ సమోస బండి ఎక్కడ కనిపించినా లాగేస్తుంటారు. ఈవెనింగ్ స్నాక్స్‌గా సమోస తీసుకునే వారే ఎక్కువమంది ఉంటారు. అయితే ఈ రుచికరమైన చిరుతిండిని సోమాలియాలో నిషేధించబడింది.
జెల్లీ కప్పులు..
జెల్లీ కప్పులను చిన్నపిల్లలు ఎక్కువగా తింటుంటారు. ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా వీటికి తింటున్నారు. కానీ ఈ జెల్లీ కప్పులను ఆస్ట్రేలియాలో అస్సలు అనుమతించరు. ఇవి తింటే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అక్కడున్న ఆరోగ్య నిపుణులు జెల్లీ కప్పులను నిషేంధించారు.
కెచప్..
ఎగ్ పఫ్, కర్రీ పఫ్ లాంటి చిరుతిండుల్లో టమాట సాస్ లేనిది భారతీయులు అస్సలు తినరు. అయితే ఈ కెచప్‌ను ఫ్రాన్స్‌లో నిషేధించబడింది.
కబాబ్స్..
భారతదేశంలో కబాబ్స్‌ను చిరుతిండిగా ఉపయోగిస్తారు. ఎంతో కాలం నుంచి ఈ జ్యుసీ కబాబ్ సంప్రదాయంగా వస్తున్నప్పటికీ దీన్ని వెనిస్‌లో నిషేధించారు.