వీడియో గేమ్స్ ఆడితే రూ.10 లక్షలు.. దరఖాస్తులను ఆహ్వానిస్తున్న కంపెనీ
కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు, పెద్దలు స్మార్ట్ ఫోన్లకు ఎంతగానో అడక్ట్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లకు ఎంతగానో అడక్ట్ అయ్యారు. కొంత మంది అయితే పబ్జి, ఫ్రీఫైర్ లాంటి ఆటలు ఆడుతూ మానసికంగా అనారోగ్యానికి గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ‘‘ఐక్యూఓఓ ఈ కన్‌స్యూమర్ ఎలక్ట్రానిక్ సంస్థ’’ వీడియో గేమ్స్ ప్రియులకు శుభవార్త తెలిపింది. గేమ్స్ మీద మంచి పట్టు ఉంటే 6 నెలల కాంట్రాక్టుకు ఏకంగా 10లక్షల రూపాయలు ఇస్తామంటోంది. కానీ 26 ఏళ్ల లోపు వయసున్న వారికే ఈ ఛాన్స్. ఇందులో సెలక్ట్ అయిన వారు IQOO అధికారులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. తమకున్న గేమింగ్ నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఐక్యూఓఓ కు డాక్యుమెంటేషన్ ఇస్తుండాలి.
అలాగే దీని ద్వారా ఐక్యూఓఓ లాంచ్ చేసిన మొబైల్‌లో మెరుగైన వీడియో గేమ్ ఫీచర్లను తయారుచేస్తారు. 2022లో ఇండియన్ గేమింగ్ పరిశ్రమ ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా గేమ్ డౌన్‌లోడర్లలో 17శాతం మంది genZ ఆట ఆడేవారే ఎక్కువ మంది ఉన్నారు. 2 బిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఐక్యూఓఓ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ జాబ్‌కు కేవలం ఇండియాలోని వ్యక్తులే అర్హులు. అలాగే వారి ఏజ్ 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. వీడియో గేమ్స్‌పై 360 డిగ్రీ నాలెడ్జ్ ఉండాలి.
Read More... కుక్కకు సర్ ఫ్రైస్.. బర్త్ డే గిఫ్ట్‌గా బంగారం అక్షరాలతో చెక్కిన లక్షల విలువైన ఇల్లు