ఆయుష్షు పెరగాలంటే వారానికి ఎన్ని రోజులు శృంగారం చేయలో తెలుసా..?

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి సెక్స్ ( SEX ) . దీని గురించి బయట మాట్లాడేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ, వీటిపై వచ్చే అనుమానాలు మాత్రం ప్రతి ఒక్కరి మైండ్ లోను అలాగే ఉండిపోతాయి. దీనివలన  ఎన్నో సమస్యలు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని డాక్టర్స్ చెప్తున్నారు. ఒక మనిషి బ్రతకడానికి తిండి, నిద్ర ఎంత అవసరమో సరైన శృంగారం కూడా అంతే అవసరమంటున్నారు పరిశోధకులు. వినడానికి […]

Update: 2021-10-12 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి సెక్స్ ( SEX ) . దీని గురించి బయట మాట్లాడేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ, వీటిపై వచ్చే అనుమానాలు మాత్రం ప్రతి ఒక్కరి మైండ్ లోను అలాగే ఉండిపోతాయి. దీనివలన ఎన్నో సమస్యలు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని డాక్టర్స్ చెప్తున్నారు. ఒక మనిషి బ్రతకడానికి తిండి, నిద్ర ఎంత అవసరమో సరైన శృంగారం కూడా అంతే అవసరమంటున్నారు పరిశోధకులు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఒక మనిషి ఆయుష్షు ను పెంచడానికి శృంగారం కూడా ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు.

సాధారణంగా ప్రతి మనిషి తమకున్న అభిరుచిని బట్టి శృంగారంలో పాల్గొంటారు. కానీ, ఒక మనిషి జీవిత కాలంలో సరైన రీతిలో శృంగారంలో ( SEX ) పాల్గొంటే ఏకంగా 20 ఏళ్లు ఆయుష్షును పెంచుకోవటం సాధ్యమంట. ఇది మరి బావుంది.. మంచి తిండి తినడం వలన.. చక్కగా నిద్రపోవడం వలన ఆయుష్షు పెంచుకోవడం విన్నాం కానీ ఇలా సరైన రీతిలో సెక్స్ చేయడం వలన ఎక్కువ రోజులు బతకవచ్చా..? అంటే .. వైద్యుల పరిశోధనల వలన ఇది రుజువు కూడా చేయనున్నారట. రెగ్యులర్ శృంగారం.. మరణించే ముప్పును తగ్గిస్తుందన్న విషయం చాలా అధ్యయనాల్లో తేలింది. ఇద్దరు ఆత్మీయ బంధంతో.. శృంగారంలో ( SEX ) పాల్గొన్నప్పుడు వారిలో ఉండే దిగులు, కుంగుబాటు, మాసిక వేదన అన్ని చాలా శాతం తగ్గిపోయి మనిషికి మాసిక ప్రశాంతత, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కాబట్టి మనిషి ఎక్కువ రోజులు బ్రతకడానికి అవి ఉపయోగపడతాయి అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలానే.. తరచూ శృంగారం చేసే వారిలో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. వ్యాయమం చేస్తూ, మంచి తిండి, నిద్రతో పాటు డైలీ రొమాన్స్.. మనిషిని ఎక్కువ కాలం బ్రతికేలా చేస్తుంది.

ఇక ఎక్కువ రోజులు అంటే ఎన్నిరోజులు అనే డౌట్ అందరికి ఉంటుంది. సాధారణంగా వారానికి ఒక్కసారి శృంగారంలో పాల్గొన్నవారి కంటే.. వారానికి రెండు మూడు సార్లు శృంగారం ( SEX ) చేసేవారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్ ఏ మోతాదు ఎక్కువగా ఉంటుందని.. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందని పరిశోధకులు నొక్కివక్కాణిస్తున్నారు. ఏదిఏమైనా ఇది కూడా ఒక మంచి పాయింటే అని విశ్లేషకులు తెలుపుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎక్కువ ఆయుష్షును పెంచుకోవాలనుకొనేవారు మంచి తిండి, నిద్రతో పాటు తమ భాగస్వామితో ప్రేమపూర్వకమైన శృంగారంలో పాల్గొనండి.

Tags:    

Similar News