డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్సు
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ చేసి, రోజుల తరబడి కార్యాలయాల చుట్టు తిరిగే పద్దతికి కేంద్రం ప్రభుత్వం బ్రేక్వేస్తోంది. ఇక నుంచి డ్రైవింగ్టెస్ట్లేకుండానే లైసెన్స్‌లు జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే దీని కోసం గుర్తింపు పొందిన డ్రైవింగ్స్కూళ్ల నుంచి సర్టిఫికెట్ మాత్రం తప్పనిసరి చేసింది. కేంద్రం దీనిపై గెజిట్జారీ చేసినా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో కేంద్ర గెజిట్రవాణ శాఖకు అందినప్పటికీ రాష్ట్రం […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ చేసి, రోజుల తరబడి కార్యాలయాల చుట్టు తిరిగే పద్దతికి కేంద్రం ప్రభుత్వం బ్రేక్వేస్తోంది. ఇక నుంచి డ్రైవింగ్టెస్ట్లేకుండానే లైసెన్స్‌లు జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే దీని కోసం గుర్తింపు పొందిన డ్రైవింగ్స్కూళ్ల నుంచి సర్టిఫికెట్ మాత్రం తప్పనిసరి చేసింది. కేంద్రం దీనిపై గెజిట్జారీ చేసినా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో కేంద్ర గెజిట్రవాణ శాఖకు అందినప్పటికీ రాష్ట్రం నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. దీంతో వచ్చే నెల నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందా… రాదా అనే అనుమానాలున్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూలై 1 నుంచి ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండానే… టెస్ట్ డ్రైవ్ లేకుండా లైసెన్స్ పొందే విధానాన్ని ప్రవేశపెట్టుతోంది. కరోనా కారణాలతో రవాణా శాఖ కార్యాలయాలకు కూడా తాళాలు పడ్డాయి. అయితే వినియోగదారుల తాకిడి ఎక్కువ ఉండటంతో కొత్త విధానానికి నిర్ణయం తీసుకుంది. కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీకి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు సంబంధించి కొన్ని నిబంధనలను సవరించింది. గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్ల నుంచి డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవింగ్ నేర్చుకున్న వారు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ గెజిట్‌లో వెల్లడించింది. గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్లలోనే ట్రాక్స్ ఉండే విధంగా నిబంధనలు విధించారు. వీటిని రవాణా శాఖ అధికారులు నిర్ధారించాల్సి ఉంటోంది.
సదరు డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఈ ట్రాక్‌ల్లో వాహనాలు నడుపాల్సి ఉంటోంది. దీని ఆధారంగా డ్రైవింగ్ సెంటర్ల నుంచి సర్టిఫికెట్ తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీని కోసం మళ్లీ ఆర్‌టీఏ కార్యాలయాలకు డ్రైవింగ్ టెస్ట్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్‌ను జతపరిస్తే సరిపోతోంది. ఇక ఒక్కో డ్రైవింగ్ స్కూల్‌కు ఐదేండ్ల వరకు కేంద్రం గుర్తింపు పత్రాలు జారీ చేస్తోంది. దీన్ని రవాణా శాఖ అధికారులు నిర్ధారించాల్సి ఉంటోంది. ఐదేండ్ల తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి. ఇలా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలోనే ఈ అవకాశం ఉంటుంది. ఇక్కడ తీసుకున్న సర్టిఫికెట్లు చెల్లుబాటు కానున్నాయి.
లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కోర్సు 4 వారాల్లో 29 గంటలు, మీడియం అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ కోర్సు 6 వారాల్లో 38 గంటలు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో స్పష్టం చేసింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టంగా వెల్లడించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలవడలేదు. దీంతో రాష్ట్రంలో వచ్చేనెల 1 నుంచి అమలు చేస్తారా… లేదా అనేది సందేహంగా మారింది.