అతి తక్కువ వడ్డీకే ఎల్ ఐసీ గృహ రుణాలు..

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తనఖా సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) అతి తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలను ఇవ్వనున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జూలైలో రూ. 50 లక్షల వరకు రుణాలకు మాత్రమే 6.66 శాతం వడ్డీతో గృహ రుణాలను ఇస్తానన్న సంస్థ తాజాగా, రూ.2 కోట్ల వరకు ఈ వడ్డీ రేట్లకే రుణాలివ్వనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఆఫర్ 700, అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని […]

Update: 2021-09-23 09:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తనఖా సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) అతి తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలను ఇవ్వనున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జూలైలో రూ. 50 లక్షల వరకు రుణాలకు మాత్రమే 6.66 శాతం వడ్డీతో గృహ రుణాలను ఇస్తానన్న సంస్థ తాజాగా, రూ.2 కోట్ల వరకు ఈ వడ్డీ రేట్లకే రుణాలివ్వనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఆఫర్ 700, అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ రుణాలు వేతనం, ఉపాధితో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది.

అలాగే, ఈ ఆఫర్ ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు మంజూరైన రుణాలకు అందుబాటులో ఉంటుందని, డిసెంబర్ 31లోపు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ మంజూరైన వారికి వర్తిస్తుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ఈ ఏడాది జూలై 1న రూ. 50 లక్షల వరకు గృహ రుణాలకు 6.66 శాతం వడ్డీని నిర్ణయించామని, ఇప్పుడు ఇదే వడ్డీ రేట్లతో రూ. 2 కోట్ల వరకు రుణాలకు పొడిగించామని హోమ్ ఫైనాన్షియర్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ వై విశ్వనాథ్ గౌడ్ చెప్పారు.

Tags:    

Similar News