మహా సీఎం ఠాక్రేకు కేంద్ర సమాచార మాజీ కమిషనర్ల లేఖ

దిశ, క్రైమ్ బ్యూరో : విరసం సీనియర్ నాయకులు వరవరరావును వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర సమాచార మాజీ కమిషనర్లు ప్రొఫెసర్ మాడబుషి శ్రీధర్, శైలేష్ గాంధీలు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కు లేఖ రాశారు. దీనిని ఆదివారం ఈ మెయిల్ ద్వారా పంపారు. వరవరరావు ఎనభై ఏండ్ల వయో వృద్దుడని, అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, కావున వెంటనే అతన్ని విడుదల చేయాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నాగం […]

Update: 2020-05-31 05:21 GMT

దిశ, క్రైమ్ బ్యూరో :
విరసం సీనియర్ నాయకులు వరవరరావును వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర సమాచార మాజీ కమిషనర్లు ప్రొఫెసర్ మాడబుషి శ్రీధర్, శైలేష్ గాంధీలు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కు లేఖ రాశారు. దీనిని ఆదివారం ఈ మెయిల్ ద్వారా పంపారు. వరవరరావు ఎనభై ఏండ్ల వయో వృద్దుడని, అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, కావున వెంటనే అతన్ని విడుదల చేయాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నాగం పన్నారనే నెపంతో పోలీసులు పదహారు వారాల పాటు విచారించి ఏలాంటి ఆధారాలను సేకరించ లేదన్నారు. ప్రస్తుతం వరవరరావు ఉంటున్న తలోజ జైల్లో కరోనా వైరస్ సోకి ముగ్గురు ఖైదీలు మరణించారని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో వరవరరావు అనారోగ్యానికి గురై ముంబైలోని జెజె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ విషయం జైలు అధికారులు, కుటుంబ సభ్యులకు కనీసం చెప్పకపోవడం బాధాకరం అని అన్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న వరవరరావును జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని లేదా వరవరరావు కుటుంబసభ్యులను మహారాష్ట్రలో తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు.

Tags:    

Similar News