రాష్ట్ర అవతరణ రోజు ఇక్కత్ దరిద్దాం !
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ఇక్కత్‌ను దరిద్దాం, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుదామని చేనేత అధ్యయన, విధాన కేంద్రం ప్రతినిధులు యర్రమాద వెంకన్ననేత, తడక యాదగిరిలు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఇక్కత్ వస్ర్తాలను ధరించి చేనేత కళాకారులకు గుండె ధైర్యాన్ని నిలపాలన్నారు. ప్రస్తుతం వస్త్ర నిల్వలు పేరుకుపోయి ఉపాధి లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, అందుకు రాజసానికి చిహ్నంగా ఉండే చేనేత వస్ర్తాలే కొనుగోలు చేసి వారికి అండగా నిలవాలన్నారు. నల్లగొండ, యాదాద్రి […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ఇక్కత్‌ను దరిద్దాం, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుదామని చేనేత అధ్యయన, విధాన కేంద్రం ప్రతినిధులు యర్రమాద వెంకన్ననేత, తడక యాదగిరిలు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఇక్కత్ వస్ర్తాలను ధరించి చేనేత కళాకారులకు గుండె ధైర్యాన్ని నిలపాలన్నారు. ప్రస్తుతం వస్త్ర నిల్వలు పేరుకుపోయి ఉపాధి లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, అందుకు రాజసానికి చిహ్నంగా ఉండే చేనేత వస్ర్తాలే కొనుగోలు చేసి వారికి అండగా నిలవాలన్నారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.200 కోట్ల చేనేత వస్త్ర నిల్వలు నిలిచిపోయాయని, అందులో రూ.150 కోట్ల విలువైన ఇక్కత్ వస్త్రాలే ఉన్నాయన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అందరూ కొనుగోలు చేయడం, ధరించడం వల్ల చేనేత రంగానికి ఉపశమనం కలుగుతుంది. కార్మికులకు మళ్లీ కాస్త పని దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 2న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఇక్కత్ వస్త్రాలే ధరిస్తున్నారని చెప్పారు.