వాళ్లు ముఖ్యమంత్రికి మర్యాద ఇవ్వడంలేదు : గుత్తా

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండలో మంగళవారం గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు ఉన్న సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాకు కట్టబెట్టారన్నారు. బీజేపీ పాలిత ప్రాంతంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, బీజేపీ నాయకులు సీఎంకు ఇచ్చే మర్యాద ఇవ్వడం లేదన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల నడ్డి విరిచిందని, సాగర్‌లో టీఆర్ఎస్‌కు […]

Update: 2021-04-13 08:22 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండలో మంగళవారం గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు ఉన్న సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాకు కట్టబెట్టారన్నారు. బీజేపీ పాలిత ప్రాంతంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, బీజేపీ నాయకులు సీఎంకు ఇచ్చే మర్యాద ఇవ్వడం లేదన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల నడ్డి విరిచిందని, సాగర్‌లో టీఆర్ఎస్‌కు సకల జనులు మద్దతు పలికారని తెలిపారు. కేసీఆర్ సభ పెడితే ప్రతిపక్షాలకు వణుకు పుడుతుందని, కేసీఆర్ సభ వద్దు అంటేనే ప్రతిపక్షాలు ఓటమిని ఒప్పుకున్నట్టే లెక్కని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News