పంత్‌ను వదిలేయండి : రోహిత్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను లక్ష్యం చేసుకొని వార్తలు రాయడం మీడియా మానేయాలని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పంత్‌కు టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ పూర్తి స్వేచ్చ ఇచ్చిందని.. అతడిపై ఒత్తిడి లేనప్పుడు మ్యాచ్ విన్నర్‌గా నిలిచే సత్తా ఉందని రోహిత్ స్పష్టం చేశాడు. మేము అతడి గురించి ఆలోచించడం మానేశాము.. ఇక మీడియా కూడా అతడిని వదిలేస్తే మంచిదని హితవు పలికాడు. ప్రతీ నిత్యం పంత్ గురించి వార్తలు […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను లక్ష్యం చేసుకొని వార్తలు రాయడం మీడియా మానేయాలని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పంత్‌కు టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ పూర్తి స్వేచ్చ ఇచ్చిందని.. అతడిపై ఒత్తిడి లేనప్పుడు మ్యాచ్ విన్నర్‌గా నిలిచే సత్తా ఉందని రోహిత్ స్పష్టం చేశాడు. మేము అతడి గురించి ఆలోచించడం మానేశాము.. ఇక మీడియా కూడా అతడిని వదిలేస్తే మంచిదని హితవు పలికాడు. ప్రతీ నిత్యం పంత్ గురించి వార్తలు రాయడం వల్ల అతడిపై ఒత్తిడి పెంచుతున్నారని.. అతడి సహజసిద్దమైన ఆటను ఆడనివ్వండని రోహిత్ అన్నాడు.
గత రెండు నెలలుగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లు ఆడుతున్న పంత్ వరుసగా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. ఈ సమయంలో ఇక అతడి జోలికి ఎవరూ వెళ్లకుంటే మరింత మంచిదని రోహిత్ అన్నాడు. కాగా, గతంలో పేలవ ఫామ్‌తో జట్టులో స్థానం కోల్పోయిన రిషబ్ పంత్.. ఆస్ట్రేలియా పర్యటనలో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసూకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.