పటాన్ చెరులో కాంగ్రెస్‌కు షాకిచ్చిన నాయకులు
దిశ, పటాన్‌చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరేందుకు నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపుతున్నారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి, ఆంజనేయులు ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డిల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ […]
దిశ, పటాన్‌చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరేందుకు నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపుతున్నారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి, ఆంజనేయులు ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డిల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజి కాలనీలో గల విద్యా భారతి హై స్కూల్లో శుక్రవారం అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను కార్పొరేటర్ వెన్నవరం సింధు ఆదర్శ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.