అటెండెన్స్ లొల్లి..ఉద్యోగిని చెప్పుతో కొట్టిన ఎల్‌డీసీ
దిశ, నల్లగొండ: విధులకు హాజరు కాకుండా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తోన్న క్రమంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తోటి ఉద్యోగిని మరో ఉద్యోగి చెప్పుతో కొట్టాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువు గ్రామ పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెంకటేశ్వర్లు అనే ఉద్యోగి మేళ్ళచెరువు గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామ పంచాయతీలో బ్రహ్మరెడ్డి అనే […]
దిశ, నల్లగొండ: విధులకు హాజరు కాకుండా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తోన్న క్రమంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తోటి ఉద్యోగిని మరో ఉద్యోగి చెప్పుతో కొట్టాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువు గ్రామ పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెంకటేశ్వర్లు అనే ఉద్యోగి మేళ్ళచెరువు గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామ పంచాయతీలో బ్రహ్మరెడ్డి అనే వ్యక్తి ఎల్‌డీసీగా పని చేస్తున్నారు. ఇటీవల బిల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హైదరాబాద్ కు పని నిమిత్తం వెళ్లాడు. అదే సమయంలో లాక్ డౌన్ ప్రకటించడంతో హైదరాబాద్ నుంచి మేళ్ళ చెరువు రాలేక పోయాడు. ఈ విషయాన్ని తన సూపీరియర్ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ ద్వారా బిల్‌కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి సోమవారం విధులకు హాజరైన బిల్‌కలెక్టర్ వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతీ రిజిస్టర్‌లో సంతకం చేసేందుకు ఎల్‌డీసీ బ్రహ్మ రెడ్డి వద్దకు వెళ్లి రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నాడు. డ్యూటీకి రాని రోజుల్లో సంతకం ఎలా చేస్తావు అని ఎల్‌డీసీ ప్రశ్నించాడు. పంచాయతీ కార్యదర్శికి ఆ విషయం చెప్పాను. నీకు ఏమీ సంబంధం. నీవు కూడా విధులకు హాజరు అవ్వకుండా ఎన్నో సార్లు రిజిస్టర్‌లో సంతకాలు చేశావు అని వెంకటేశ్వర్లు సమాధానమిచ్చాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఎల్‌డీసీ బ్రహ్మరెడ్డి బిల్ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది.తీవ్ర కోపోద్రిక్తుడైన ఎల్‌డీసీ బిల్‌కలెక్టర్‌ను చెప్పుతో కొట్టాడు. ఈ విషయాన్ని బాధిత ఉద్యోగి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Tags: corona, lockdown, bill collector, ldc, fight each other, cdc slapped with sandals