రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌలపై లా సూట్ !
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ చానళ్లపై ఆంక్షలు విధించాలని కోరారు. బాధ్యతారాహిత్య, అపఖ్యాతిపాలు చేసే వ్యాఖ్యలు ప్రసారం చేయడం, మీడియా ట్రయల్స్ మానుకోవాలని లా సూట్ దాఖలు చేశారు. రిపబ్లిక్ టీవీ, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి, రిపోర్టర్ ప్రదీప్ భండారి, టైమ్స్ నౌ, టైమ్స్ నౌ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ శివశంకర్, గ్రూప్ ఎడిటర్ నవికా కుమార్‌లకు మార్గదర్శకాలు జారీచేయాలని […]
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ చానళ్లపై ఆంక్షలు విధించాలని కోరారు. బాధ్యతారాహిత్య, అపఖ్యాతిపాలు చేసే వ్యాఖ్యలు ప్రసారం చేయడం, మీడియా ట్రయల్స్ మానుకోవాలని లా సూట్ దాఖలు చేశారు. రిపబ్లిక్ టీవీ, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి, రిపోర్టర్ ప్రదీప్ భండారి, టైమ్స్ నౌ, టైమ్స్ నౌ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ శివశంకర్, గ్రూప్ ఎడిటర్ నవికా కుమార్‌లకు మార్గదర్శకాలు జారీచేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కంపు, డ్రగ్గీలు, మురికి, రోతలాంటి పదాలతో బాలీవుడ్‌ను సంబోధించకుండా ఆదేశించాలని కోరారు.
కేబుల్ నెట్‌వర్క్స్ రూల్స్ 1994 కింద ప్రోగ్రామ కోడ్‌లను పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని, సుశాంత్ సింగ్ మరణం, డ్రగ్ కేసులో ఎన్‌సీబీ దర్యాప్తు రిపోర్టింగ్‌పై పూర్తి ఆంక్షలు విధించాలని తాము డిమాండ్ చేయడం లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి రిపోర్ట్ చేయాలని మాత్రమే అర్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ది సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, అజయ్ దేవ్‌గన్ ఫిలిమ్స్, అనిల్ కపూర్ ఫిలిం అండ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్, ధర్మ ప్రొడక్షన్ సహా పలు నిర్మాణ సంస్థలు ఈ లా సూట్‌ను ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేశాయి.