రేపటి నుంచి లాసెట్ కౌన్సెలింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: లాసెట్ మొదటి ఫేజ్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 14 నుంచి చేపడుతున్నట్టు కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. లాసెట్ -2020 పరీక్షలో అన్ని కోర్సులకు కలిపి 21,559 మంది అర్హత సాధించారని వారంతా తమ ఒరిజనల్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. విద్యార్హత, ఆదాయం, కులం, స్పోర్ట్స్ కోటా వంటి అభ్యర్థుల అర్హతను నిర్ణయించే అన్ని రకాల పత్రాల ఒరిజనల్స్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులకు సందేహాలు, […]
దిశ, తెలంగాణ బ్యూరో: లాసెట్ మొదటి ఫేజ్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 14 నుంచి చేపడుతున్నట్టు కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. లాసెట్ -2020 పరీక్షలో అన్ని కోర్సులకు కలిపి 21,559 మంది అర్హత సాధించారని వారంతా తమ ఒరిజనల్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. విద్యార్హత, ఆదాయం, కులం, స్పోర్ట్స్ కోటా వంటి అభ్యర్థుల అర్హతను నిర్ణయించే అన్ని రకాల పత్రాల ఒరిజనల్స్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులకు సందేహాలు, ఏవైనా సమస్యలుంటే ఆఫీస్ సమయాల్లో 9908021100 లేదా 040-27070028 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.