2డీజీ ఉత్పత్తి, మార్కెటింగ్‌కి డీఆర్‌డీఓ అనుమతి పొందిన లారస్ ల్యాబ్స్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ చికిత్సకు వినియోగిస్తున్న 2 డియాక్సీ-డి-గ్లూకోజ్(2డీజీ) తయారీతో పాటు మార్కెట్ చేసేందుకు రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) నుంచి లైసెన్స్ పొందినట్టు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ శుక్రవారం ప్రకటించింది. దేశీయంగా కొవిడ్ బారిన పడిన వారికి 2డీజీని వాడేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చిందని లారస్ ల్యాబ్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. లారస్ ల్యాబ్స్ ఇప్పటికే 2డీజీ అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ చికిత్సకు వినియోగిస్తున్న 2 డియాక్సీ-డి-గ్లూకోజ్(2డీజీ) తయారీతో పాటు మార్కెట్ చేసేందుకు రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) నుంచి లైసెన్స్ పొందినట్టు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ శుక్రవారం ప్రకటించింది. దేశీయంగా కొవిడ్ బారిన పడిన వారికి 2డీజీని వాడేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చిందని లారస్ ల్యాబ్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
లారస్ ల్యాబ్స్ ఇప్పటికే 2డీజీ అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ)తో దరఖాస్తు చేసుకుంది. గత నెల ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ 2డీజీ రిటైల్ ధర గరిష్ఠంగా రూ. 990కు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, 2డీజీ వినియోగానికి అనుమతికి ఆమోదం లభించిన నేపథ్యంలో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో లారస్ ల్యాబ్స్ షేర్ ధర 1.08 శాతం పెరిగి రూ. 674.20 వద్ద ట్రేడయింది.