30 మెగావాట్ల సోలార్ ప్లాంటు ప్రారంభం

దిశ, న్యూస్‌బ్యూరో: సింగరేణి తలపెట్టిన 300 మెగావాట్స్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో భాగంగా మణుగూరులో 30 మెగావాట్ల సోలార్ ప్లాంట్ సింక్రనైజేషన్ ప్రక్రియ గురువారం విజయవంతమైందని సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంస్థ తొలిదశలో నిర్మించ తలపెట్టిన 129మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యంలో భాగంగా ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో 10మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించామని, […]

Update: 2020-07-30 07:23 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: సింగరేణి తలపెట్టిన 300 మెగావాట్స్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో భాగంగా మణుగూరులో 30 మెగావాట్ల సోలార్ ప్లాంట్ సింక్రనైజేషన్ ప్రక్రియ గురువారం విజయవంతమైందని సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంస్థ తొలిదశలో నిర్మించ తలపెట్టిన 129మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యంలో భాగంగా ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో 10మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించామని, ప్రస్తుతం మణుగూరు ప్లాంట్ కూడా ప్రారంభించడంతో మొత్తం 40మెగా వాట్స్ విద్యుత్తు రాష్ట్ర గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నట్లయిందని తెలిపారు. త్వరలో రామగుండం 3 ఏరియాలోని 50మెగావాట్ల ప్లాంటు, ఇల్లందు ఏరియాలోని 30మెగావాట్ల ప్లాంట్లు కూడా మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నామని తెలిపారు. దీంతో తొలి దశ సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు.

కరోనా కారణంగా నిర్మాణం కొంత మందగించి‌నప్పటికీ, జాగ్రత్త‌లు తీసుకుని మణుగూరు ప్లాంటు పూర్తి చేశామని తెలిపారు. పాత మణుగూరు గ్రామానికి సమీపంలో 150 ఎకరాలవిస్తీర్ణంలో సుమారు రూ.125కోట్ల వ్యయం‌తో ఈ 30మెగావాట్ల ప్లాంట్ నిర్మించారు. ప్లాంట్‌లో భాగంగా లక్ష సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ నిర్మాణ పనులను ఛైర్మన్ శ్రీధర్ ఆదేశంపై డైరెక్టర్ (ఈ అండ్ ఎం ) ఎస్. శంకర్ స్వయంగా పర్యవేక్షించారు. ప్రముఖ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ నిర్మాణం పూర్తి చేసింది. ప్లాంటులో ఉత్పత్తి అయ్యే 30 మెగావాట్ల విద్యుత్తును స్థానికంగా ఉన్న 220 కేవీ సబ్ స్టేషన్‌కు సరఫరా చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేయడానికి ప్లాంటులో ప్రత్యేక సబ్ స్టేషన్ నిర్మించారు. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో సింగరేణికి ఏడాదికి రూ.11 కోట్లు ఆదా కానున్నాయి.

ఇదిలా ఉంటే సింగరేణి సంస్థ రెండవ దశలో నిర్మించతలపెట్టిన 90మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను నిర్మించడానికి ప్రముఖ కంపెనీ అదానీకి కాంట్రాక్టు అప్పగించారు. త్వరలోనే మూడవ దశ‌ ప్లాంట్ల టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టు ఏజెన్సీని ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న భారీ జలాశయాలపై తేలియాడే 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా సంస్థ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మణుగూరు‌లో జరిగిన సింక్రనైజేషన్ కార్యక్రమాన్ని డైరెక్టర్ ఎస్.శంకర్ కొత్తగూడెం నుంచి పర్యవేక్షించారు. మణుగూరు జీఎం. జె.రమేష్ ,ఇంజనీర్ ప్రసాదరావు, కన్సల్టెంట్ మురళీధరన్, బీహెచ్ఈఎల్ ఏజీఎం బన్వల్కర్‌, డీజీఎం నవీన్ కుమార్‌, ట్రాన్స్‌కో ఎస్.ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags:    

Similar News