పరిశోధనలతోనే సమాజ వికాసం: ఎస్. రామచంద్రం
దిశ, తెలంగాణ బ్యూరో: నాణ్యమైన పరిశోధనల ద్వారానే సమాజ వికాసం సాధ్యమవుతుందని అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఎస్. రామచంద్రం అన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభమైన ‘రీసెర్చ్ ఔట్‌పుట్ -2020 ఫ్రమ్ సెంట్రా అండ్ ఎసీఎస్ఎస్’ రెండు రోజుల వర్క్‌ఫాపునకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భాషలపై పరిశోధనలు చేయడం ద్వారా వాటిలో దాగి ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి అందివ్వచ్చని తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఏర్పడిన డిజిటల్ డివైడ్ గ్యాప్‌ను పూడ్చేందుకు ప్రభుత్వం […]
దిశ, తెలంగాణ బ్యూరో: నాణ్యమైన పరిశోధనల ద్వారానే సమాజ వికాసం సాధ్యమవుతుందని అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఎస్. రామచంద్రం అన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభమైన ‘రీసెర్చ్ ఔట్‌పుట్ -2020 ఫ్రమ్ సెంట్రా అండ్ ఎసీఎస్ఎస్’ రెండు రోజుల వర్క్‌ఫాపునకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భాషలపై పరిశోధనలు చేయడం ద్వారా వాటిలో దాగి ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి అందివ్వచ్చని తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఏర్పడిన డిజిటల్ డివైడ్ గ్యాప్‌ను పూడ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డి.రవీందర్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ఓయూ ఓఎస్‌డీ కృష్ణారావు, రూసా కోఆర్డినేటర్ శ్రీరాం వెంకటేష్, చెన్న బసవయ్య, కరుణాకర్, స్టీవెన్ సన్, మురళీ కృష్ణ, విజయ, అనుపమా పాల్గొన్నారు.