నేడు శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల

నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేయనున్నారు.

Update: 2023-03-24 02:26 GMT

దిశ, వెబ్ డెస్క్: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేయనున్నారు. దివ్యాంగులు, అదేవిధంగా వృద్ధులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ టోకెన్లను విడుదల చేయనుంది. గురువారం స్వామివారిని 58,965 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.5 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 25,113 మంది తలనీలాలు సమర్పించారు.

Tags:    

Similar News