సూపర్ స్టార్ రజినీకాంత్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ రజినీకాంత్‌పై అధికార వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రజినీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్‌పై అధికార వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రజినీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ముందుచూపుతో అనేక అద్భుతాలు సృష్టించారని చంద్రబాబును ఆకాశానికెత్తారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు రజినీకాంత్‌ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు.
మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని వంటి వాళ్లు వ్యక్తిగతంగానూ దూషణలు చేస్తున్నారు. తాజాగా.. రజినీకాంత్ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి స్పందించారు. ‘రజనీకాంత్ రోజూ చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబును పొగుడుకోమనండి.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రజనీకాంత్ తమిళవాళ్లకే సూపర్ స్టార్. తెలుగు వాళ్లకు కాదు. మాకూ సూపర్ స్టార్ ఉన్నారు.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారికి జగన్ గారు అంటే ఎంతో ప్రేమ.. అన్నా అన్నా అంటూ వైఎస్సార్ గారికి ఇచ్చినంత గౌరవం చిరంజీవి గారికి జగన్ గారు ఇస్తారు’ అని పోసాని చెప్పుకొచ్చారు. పోసాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరో చర్చకు దారితీశాయి.
Read more: