మోదీ టూర్.. మళ్లీ ప్రోటోకాల్ రచ్చ

ఈ నెల 8న హైదరాబాద్‎కు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో అదే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారా.. లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Update: 2023-04-06 04:25 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 8న హైదరాబాద్‎కు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో అదే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారా.. లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‎కు ఇప్పటికే ఆహ్వానాన్ని పంపినట్లు ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో మోదీ పర్యటించినప్పుడల్లా సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రధానికి స్వాగతం పలికే సాంప్రదాయాన్ని రాష్ట్రం ప్రభుత్వం, సీఎం కేసీఆర్ విస్మరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది.

దీంతో మరోసారి బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రోటోకాల్ రగడ అగ్నికి ఆజ్యం పోసేలా కనబడుతోంది. ప్రధాని పర్యటనలో షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ కు కొంత సమయం కేటాయించినట్లు సమాచారం. శనివారం హైదరాబాద్‎కు భారత ప్రధాని పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడేందుక ఏడు నిమిషాల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Read more:

8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా

టెన్త్ పేపర్ ఔట్‌తో వేడెక్కిన రాజకీయం.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన వ్యవహారం

Tags:    

Similar News