అమిత్ షా టూర్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం

అమిత్ షా తెలంగాణ పర్యటనపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పగటి వేశాగాళ్ల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని, సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని అన్నారు.

Update: 2023-04-24 06:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అమిత్ షా తెలంగాణ పర్యటనపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పగటి వేశాగాళ్ల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని, సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని అన్నారు. సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సంక్షేమం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఏదో ఎన్నికల ముందు సభలు.. సమావేశాలు పెట్టు కొని పబ్బం గడిపేవారు కాదని పేర్కొన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి రాలేదని, ప్రజలు అందరించి ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని అన్నారు.

దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ పట్ల దేశ వ్యాప్తంగా అన్నీ వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో బీజేపీ నేతల మైండ్ బ్లాక్ అవుతుందని, బీఆర్ఎస్ ప్రతిష్ట దెబ్బ తీయాలన్న కుట్రలు కుతంత్రాలు పని చేయవు అన్నారు. తెలంగాణ సమాజం గురించి అమితాషా కు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారని, ఇప్పటి కైనా రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుడు మాటలు వినకుండా.. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తున్నామో.. ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నామో చెప్పుకోవాలన్నారు. కేసీఆర్‌పై, బీఆర్ఎస్ విమర్శలు మానుకోకుంటే మునుముందు తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొడుతారని హెచ్చరించారు.

Also Read..

కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు 

Tags:    

Similar News